మెగా హీరోల తమిళ రీమేక్ ఈమధ్య మన హీరోలంతా ఇతర భాషల సినిమాలపై మక్కువ చూపిస్తున్నారు. వాటి రీమేక్స్‌లో నటించాలని ఆశపడుతున్నారు. ఈ విషయంలో మెగా హీరోలే కాస్త ముందున్నారని చెప్పొచ్చు. ఆల్రెడీ చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్స్‌ని లైన్‌లో పెట్టారు. పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్‌గా మెప్పించాక భీమ్లానాయక్‌తో బరిలోకి దిగాడు. ఇప్పుడు మరో మెగా రీమేక్ గురించిన వార్తలు గుప్పుమంటున్నాయి.
తంబి రామయ్య, సముద్రఖని ప్రధాన పాత్రల్లో పోయినేడు ‘వినోదాయ సితమ్’ అనే తమిళ చిత్రం విడుదలైంది. ఇదో ఫ్యాంటసీ డ్రామా. ఓటీటీలో రిలీజైనా మంచి టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో మన నిర్మాతల కన్ను దానిపై పడింది. ఆల్రెడీ రీమేక్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయని, పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారని కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనతో నటించే రెండో హీరో ఎవరు అనేదానికి జవాబు దొరకలేదు.
కానీ ఇప్పుడు ఆ హీరో పేరు బైటికి వచ్చింది. అతనెవరో కాదు.. సాయి ధరమ్ తేజ్. ఈ రీమేక్‌లో పవన్‌తో పాటు తేజ్ నటిస్తాడనే వార్త వైరల్ అవుతోంది. యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలల పాటు నటనకి దూరంగా ఉన్న తేజ్, త్వరలో సెట్స్‌కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. అతను చేయబోయే సినిమాల లిస్టులో ఇది కూడా ఉందని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒరిజినల్‌ను తెరకెక్కించిన సముద్రఖనియే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు.
వినడానికే ఈ వార్త ఎక్సయిటింగ్‌గా ఉంది. ఒక మెగా హీరో మరో మెగా హీరో మూవీలో తళుక్కుమనడం చాలాసార్లు చూశాం. కానీ ఇద్దరు మెగా హీరోలు కలిసి ఓ ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్‌లో పవన్, రామ్ చరణ్ కలిసి నటిస్తారని అందరూ ఆశపడ్డారు కానీ అది వర్కవుటవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ అయినా పట్టాలెక్కితే వారి ఆశ తీరుతుంది. లేదంటే ఇది కూడా ఓ పుకారుగానే మిగిలిపోతుంది.
This post was last modified on February 4, 2022 10:23 pm
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…