హ హ హాసిని అంటూ ఒకప్పుడు కుర్రకారు గుండెలకు గేలాలు వేసి లాగింది జెనీలియా. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ నటుడు, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అయిన రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లాడి ముంబై వెళ్లిపోయింది. అప్పటి నుంచి చాలాసార్లు ఆమె రీ ఎంట్రీ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అవి ఇన్నాళ్లకి నిజమవుతున్నాయి.
ఎట్టకేలకి జెనీలియా హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది. నిజానికి ఆమె నటనకు ఎప్పుడూ దూరమైపోలేదు. ఎప్పడైనా ఓ సినిమాలో గెస్ట్‌గా మెరుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయి హీరోయిన్‌గా వస్తోంది. తన భర్త రితేష్‌తో కలిసి ‘మిస్టర్ మమ్మీ’ అనే మూవీలో నటిస్తోంది జెనీ. షాద్ అలీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా వదిలారు.
ఈ పోస్టర్ చూడటానికే చాలా ఫన్నీగా ఉంది. జెనీలియా ప్రెగ్నెంట్‌గా ఉంది. ఆమె పక్కనే ఉన్న రితేష్ కూడా బేబీ బంప్‌తో ఉన్నాడు. దాంతో ఇదేదో డిఫరెంట్ సబ్జెక్ట్ అనే ఫీలింగ్ కలుగుతోంది. అది ముమ్మాటికీ నిజమే అంటున్నారు మేకర్స్. ఇదో కామెడీ ఫిల్మ్ అని, ఆద్యంతం కడుపుబ్బ నవ్విస్తుందని చెబుతున్నారు.
ఇలాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నందుకు జెనీలియా కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. తన కెరీర్ బాలీవుడ్ మూవీతో స్టార్టయ్యింది. అందులో రితేష్ హీరో. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలోనూ అతనే హీరో కావడం ఎక్సయిటింగ్‌గా ఉందంటోందామె. మరి అప్పటిలాగే ఇప్పుడు కూడా బిజీ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.
This post was last modified on February 4, 2022 8:06 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…