కొద్ది రోజులుగా సినిమా రిలీజుల విషయంలో పెద్ద కన్‌ఫ్యూజనే నెలకొంది. ఒకదాని తర్వాత ఒకటిగా అనౌన్స్‌మెంట్లు వస్తూనే ఉన్నాయి. పైగా టీమ్స్ అన్నీ రెండేసి డేట్స్ లాక్ చేస్తున్నాయి. దాంతో అవన్నీ గుర్తు పెట్టుకోలేక, ఏ సినిమా ఎప్పుడొస్తుందో అర్థం కాక జుట్లు పీక్కుంటున్నారు మూవీ లవర్స్.
అయితే ఈ విషయంలో తాను అందరికంటే ఏడాకులు ఎక్కువే చదివానంటున్నాడు నాని. తాను నటిస్తున్న ‘అంటే సుందరానికీ’ మూవీ విడుదల తేదీని నిన్న ప్రకటించాడు నాని. ఒకటీ రెండూ కాదు.. తన సినిమాకి ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ లాక్ చేసి షాకిచ్చాడు.
ఏప్రిల్ 22, 29.. మే 6, 20, 27.. జూన్ 3, 10.. ఇవీ నాని ఇచ్చిన డేట్స్. వీటిలో ఏదో ఒక తేదీకి ప్రేక్షకుల ముందుకు వస్తామని చెబుతున్నాడు. అది కూడా మామూలుగా చెప్పలేదు. ‘మీరంతా రెండు డేట్స్ బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా. ఆవకాయ సీజన్ మొత్తాన్నీ బ్లాక్ చేసేశా. ఏ డేట్‌కి రావాలో మెల్లగా నిర్ణయిస్తాం’ అంటూ తనదైన స్టైల్‌లో ఫన్నీగా చెప్పాడు.
ఒకరితో ఒకరు పోటీ పడిపోయి రెండు డేట్స్ లాక్స్ చేసినవాళ్లపై నాని వేసిన ఈ సెటైర్ బాగా పేలిందనే చెప్పాలి. మరి నాని వీటిలో ఏదో ఒక తేదీకి వస్తాడో చివర్లో ఏడూ కాదని ఎనిమిదో తేదీని ఎంచుకుంటాడో చూడాలి. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మంచ కాంబినేషన్ కుదరడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.
This post was last modified on February 3, 2022 8:06 pm
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…