యువత మీద చెడు ప్రభావం చూపేలా ఉందంటూ ‘పుష్ప’ సినిమా మీద పద్మశ్రీ గరికపాటి నరసింహారావు విరుచుకుపడ్డ సమయంలోనే.. ఆ సినిమా స్ఫూర్తితో భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ప్రయత్నించిన ఓ వ్యక్తి పోలీసులకు దొరికిపోవడం సంచలనం రేపుతోంది. ‘పుష్ప’ సినిమాలో పోలీసుల కళ్లు గప్పి ఎర్రచందనం తరలించడానికి హీరో రకరకాల మార్గాలు కనుక్కొంటాడన్న సంగతి తెలిసిందే.
పాల వ్యానులో సగం వరకు ఎర్రచందనం దుంగల్ని పెట్టి.. వెల్డింగ్ చేసి, దానిపైన పాలు పోయడం.. పెళ్లికి జనాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్లో కింద దుంగలు పరిచడం.. అంబులెన్సుల్లో చందనం దుంగలు పెట్టడం.. ఇలా రకరకాల మార్గాల్లో హీరో చందనం స్మగ్లింగ్ చేస్తాడు. ఇవన్నీ చూసి స్ఫూర్తి పొంది సినీ ఫక్కీలో కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని తరలిస్తున్న యాసిన్ ఇనాయతుల్లా అనే స్మగ్లర్ మహారాష్ట్రాలో పోలీసులకు దొరికిపోయాడు.
ఎర్రచందనం దుంగల్ని ఒక ట్రక్కులో కింద పరిచేసి.. వాటి మీద కూరగాయలు, పళ్లు పెట్టి కర్ణాటక బార్డర్ దాటించిన ఇనాయతుల్లా మహారాష్ట్రాలో పోలీసుల తనిఖీ సందర్భంగా దొరికిపోయాడు. అతను రవాణా చేస్తున్న దుంగల విలువ రూ.2.45 కోట్లు కావడం గమనార్హం. పోలీసుల కళ్లు గప్పాడో.. వాళ్లకు లంచాలిచ్చి బయటపడ్డాడో కానీ.. కొన్ని వందల కిలోమీటర్లు సాఫీగానే ఆ స్మగ్లర్ ప్రయాణం సాగిపోయింది.
కానీ మహారాష్ట్ర పోలీసులు మాత్రం ఇనాయతుల్లాను విడిచిపెట్టలేదు. ‘పుష్ప’ సినిమా స్ఫూర్తితోనే ఇలా చేసినట్లు సదరు స్మగ్లర్ పోలీసులకు చెప్పాడట. సంబంధింత ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కనుక చూస్తే గరికపాటి నరసింహారావు మరింతగా ‘పుష్ప’ సినిమా మీద ఫైర్ అవుతారేమో.
This post was last modified on February 3, 2022 9:35 pm
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…