హీరోగా, నిర్మాతగానే కాక దర్శకుడిగానూ దూసుకుపోతున్న అజయ్ దేవగన్.. మరోవైపు ఇతర సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఆల్రెడీ ‘ఆర్ఆర్ఆర్’లో ఎంతో ముఖ్యమైన పాత్రలో నటించాడు. నిడివి తక్కువే అయినా తనది సినిమాకి పిల్లర్ లాంటి క్యారెక్టర్ అని రాజమౌళి చెప్పాడు. ‘గంగూబాయ్ కథియావాడి’లో కూడా అలాంటి పాత్రే పోషించాడు అజయ్.
ముంబైలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాని శాసించిన గంగూబాయ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. ఆలియా భట్ టైటిల్ రోల్ పోషిస్తోంది. షూటింగ్ పూర్తై చాలా కాలమైంది. విడుదల చేద్దామంటే కరోనా అడ్డుపడింది. ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకి ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముహూర్తం కుదిరింది. దాంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్.
త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నామంటూ ఆలియా బ్యూటిఫుల్ ఫొటో ఒకటి నిన్న రిలీజ్ చేశారు. ఇప్పుడు అజయ్ దేవగన్ లుక్‌ని కూడా రివీల్ చేశారు. నేనెవరో మీకు చూపించడానికి వచ్చేస్తున్నాను అంటూ తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అజయ్. సూటూ బూటూ, తలపై టోపీ, కళ్లకి గాగుల్స్ పెట్టి ఓ టెరిఫిక్ గెటప్‌లో ఉన్నాడు అజయ్.
గంగూబాయ్‌ని చిన్నతనంలోనే ఎవరో ముంబైలోని కామాఠిపురా అనే రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తారు. అక్కడే పెరిగి పెద్దదవుతుంది. ఓ టైమ్ వచ్చేసరికి ఆ ఏరియాకి రాణి అయిపోతుంది. మాఫియా లీడర్లతో సంబంధాలు పెట్టుకుంటుంది. రాజకీయ నాయకుల్ని కూడా లెక్క చేయనంత స్ట్రాంగ్ అయిపోతుంది. అలాంటి గంగూబాయ్ ఓ వ్యక్తిని అన్నలా భావిస్తుంది. అతని పాత్రనే అజయ్ పోషించాడని టాక్. పాత్ర ఏదైతేనేం.. అజయ్ లుక్ మాత్రం అదిరిపోయిందనేది వాస్తవం.
This post was last modified on February 3, 2022 4:25 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…