Movie News

మార్ఫ్‌డ్ ఫొటో వైర‌ల్.. హీరోయిన్ హ‌ర్టు

సోష‌ల్ మీడియా విస్తృతి బాగా పెరిగిపోయిన నేప‌థ్యంలో ఏ వార్త నిజ‌మో ఏది అబ‌ద్ధ‌మో తెలుసుకోవ‌డం చాలా క‌ష్ట‌మైపోతోంది. ఇక ఫొటోల సంగ‌తైతే చెప్పాల్సిన ప‌నే లేదు. ఒరిజిన‌ల్ లాగే అనిపించేఫేక్ ఫొటోలు తెగ తిరిగేస్తుంటాయి సోష‌ల్ మీడియాలో. హీరోయిన్ల ఫొటోల‌ను ఎలా మార్ఫ్ చేసి వైర‌ల్ చేస్తుంటారో తెలిసిందే.

ఇక హాట్ ముద్ర వేసుకున్న హీరోయిన్ల‌కైతే ఈ బాధ ఎప్పుడూ ఉండేదే. బాలీవుడ్ భామ నేహా శ‌ర్మ ఆ మ‌ధ్య తానుంటున్న హోట‌ల్ గది నుంచి ఒక ఫొటో రిలీజ్ చేస్తే.. ఆ గ‌దిలో ఒక చోట సెక్స్ టాయ్ ఉన్న‌ట్లుగా ఫొటోను మార్ఫ్ చేసి వైర‌ల్ చేయ‌డం.. దాన్ని ఖండిస్తూ ఒరిజిన‌ల్ ఫొటో పెట్టి నేహా మ‌ళ్లీ వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డం తెలిసిందే. ఇప్పుడు సౌత్ ఇండియన్ హాట్ గ‌ర్ల్ మాళ‌విక మోహ‌న‌న్‌కు సంబంధించి ఒక ఫొటో ఇలాగే సోష‌ల్ మీడియాలో తెగ తిరిగేస్తుండ‌టంతో ఆమె వివ‌ర‌ణ ఇచ్చుకుంది.

సినిమాల‌తో కంటే త‌న హాట్ ఫొటో షూట్ల‌తోనే సోష‌ల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది మాళ‌విక‌. ఇటీవ‌ల మాల్దీవుల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆమె ఫొటో షూట్లు ఎంత చ‌ర్చ‌నీయాంశం అయ్యాయో తెలిసిందే. ఐతే ఇదే స‌మ‌యంలో మాళ‌విక పాత ఫొటో ఒక‌టి వైర‌ల్ అవుతూ మాళ‌విక కంట ప‌డింది.

అందులో క్లీవేజ్ షోతో కుర్రాళ్ల‌ను బాగానే అట్రాక్ట్ చేస్తోంది మాళ‌విక‌. ఐతే ఇదే ఫొటోను ఇంకొంచెం మార్ఫ్ చేసి.. ఆమె బ్రా లెస్‌గా ఈ షూట్ చేసిన భ్ర‌మ క‌ల్పిస్తూ ఆ ఫొటోను వైర‌ల్ చేసేశారు. కొన్ని మీడియా సంస్థ‌లు సైతం ఈ ఫొటోను ఒరిజిన‌ల్ అన్న‌ట్లుగా వాడేస్తుండ‌టంతో మాళ‌విక అలెర్ట‌యింది. అస‌లు ఫొటోను షేర్ చేసి, దీన్ని మార్ఫ్ చేసి పెడుతున్నారని, ఒక మీడియా సంస్థ కూడా త‌న వెబ్ సైట్లో ఇదే ఫొటోను పెట్టింద‌ని, ఇది క‌రెక్ట్ కాద‌ని మాళ‌విక ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

This post was last modified on February 3, 2022 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ్యూరిచ్‌లో ఉన్నామా.. జువ్వ‌ల‌పాలెంలో ఉన్నామా? : లోకేష్

స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైన ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌దస్సుకోసం వెళ్లిన‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారా లోకేష్‌,…

3 hours ago

ఎవరు ఔనన్నా, కాదన్నా.. కాబోయే సీఎం లోకేశే

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…

3 hours ago

ప్రత్యేక విమానాలు లేవు.. కాస్ట్ లీ కార్లూ లేవు

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…

4 hours ago

కెరీర్లను డిసైడ్ చేయబోతున్న సినిమా

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…

5 hours ago

నయా లుక్కులో నారా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…

5 hours ago

మ‌రో జ‌న్మంటూ ఉంటే.. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు నోటి నుంచి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు వెలువ‌డ్డాయి. మ‌రో జ‌న్మ అంటూ ఉంటే.. మ‌ళ్లీ తెలుగు వాడిగానే…

7 hours ago