Movie News

‘ఖిలాడి’ని వాయిదా వేయించిన జగన్

మాస్ మహరాజా రవితేజ కొత్త సినిమా ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న విడుదలకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. కరోనా మూడో వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని 11నే రిలీజ్ చేయాలని పట్టుదలతో కనిపించింది చిత్ర బృందం. ఈ దిశగా ప్రమోషన్లు కూడా జోరుగానే నడుస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆలోచన మారిపోయినట్లు సమాచారం.

ఇందుక్కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే. నిజానికి ఈ వారంతో ఏపీలో నైట్ కర్ఫ్యూ ముగుస్తుందని అనుకున్నారు. ఆ అంచనాతోనే 11న ‘ఖిలాడి’ని రిలీజ్ చేయొచ్చని భావించారు. కానీ జగన్ సర్కారు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 14 వరకు ఇది అమలవుతుందని ప్రకటించింది. దీంతో సెకండ్ షోలకు ఇబ్బంది అవుతుంది. ఆదాయానికి గండి పడుతుంది.

50 పర్సంట్ ఆక్యుపెన్సీ వల్ల పడే కోతకు తోడు సెకండ్ షోలు కూడా రద్దయ్యాయంటే కష్టమవుతుంది.అందుకే ‘ఖిలాడి’ టీం రిలీజ్‌ను ఒక వారానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ నైట్ కర్ఫ్యూ పొడిగించకుంటే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అప్పటికి కరోనా ప్రభావం తగ్గుతుందని, కర్ఫ్యూ కచ్చితంగా ఎత్తేస్తారని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా థియేటర్లపై ఇప్పటికే ఆంక్షలు ఎత్తి వేస్తున్నారు.

కానీ ఏపీలో మాత్రం చిత్రంగా రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఏ ప్రయోజనం లేకుండా నైట్ కర్ఫ్యూ అమలు చేయడం ద్వారా సెకండ్ షోలను రద్దు చేయిస్తున్నారు. సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ‘ఖిలాడి’ వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుండటంతో ఫిబ్రవరి 11న ‘సెహరి’తో పాటు ‘డీజే టిల్లు’ రాబోతున్నాయి. ‘డీజే టిల్లు’ను ఈ వారమే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ.. వారం వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on February 2, 2022 7:16 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

5 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

6 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

7 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

8 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

8 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

10 hours ago