Movie News

భీమ్లా నాయక్ లేదు.. ఫిక్సయిపోవచ్చు

భీమ్లా నాయక్ సంక్రాంతి రావాల్సిన సినిమా. అనూహ్య పరిణామాల మధ్య ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. ఇప్పుడు ఆ తేదీకి రావడం కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కరోనా మూడో వేవ్ భయం అనుకున్నంతగా లేకపోయినా.. ఈ నెల 25వ తేదీకి పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయని అనిపిస్తున్నా.. ఆ టైంకి ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ కాపీ రెడీ అయ్యే ఛాన్సున్నా సరే.. ఆ డేట్‌కు చిత్ర బృందం కట్టుబడే పరిస్థితి కనిపించడం లేదు. ‘భీమ్లా నాయక్’ వాయిదా పడటం గ్యారెంటీ అని వేరే నిర్మాతలు కూడా ఫిక్సయినట్లే ఉన్నారు.

ఈ విషయంలో వారికి స్పష్టమైన సమాచారమే ఉన్నట్లుంది. ఆల్రెడీ ఈ తేదీకి శర్వానంద్ సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ రిలీజ్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘సెబాస్టియన్’ను కూడా అదే రోజుకు ఫిక్స్ చేశారు. ఇవి చాలవన్నట్లు తమిళ అనువాద చిత్రం ‘వలిమై’ను ఫిబ్రవరి 24కు ఖాయం చేశారు.

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించిన ఆ చిత్రాన్ని తెలుగులోనూ పెద్ద ఎత్తునే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘భీమ్లా నాయక్’ వచ్చేట్లయితే ఈ మూడు చిత్రాలు రేసులోకి వచ్చేవి కావు. ‘భీమ్లా నాయక్’ను వాయిదా వేయడం వ్యూహాత్మకంగానే జరిగినట్లుగా అనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద ఏ స్థాయిలో కక్ష కట్టిందో పోయినేడాది ‘వకీల్ సాబ్’ రిలీజైనపుడే స్పష్టం అయింది. ఇప్పుడు భారీ చిత్రాల వరుసలో ముందుగా వస్తే ఆ సినిమాను కచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశముంది.

అందుకే ఏదో ఒక భారీ చిత్రం ముందు రిలీజై.. దానికి టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూసుకుని ఆ తర్వాత తమ చిత్రాన్ని థియేటర్లలోకి దించాలన్న ఆలోచనతో ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మార్చిలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నాయి కాబట్టి వాటికి టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో వెసులుబాటు దక్కే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం గట్టిగానే ప్రయత్నాలు జరుగుతాయనడంలో సందేహం లేదు. వాటి విషయంలో ఏం జరుగుతుందో చూసుకుని సెకండ్ ఆప్షన్‌గా పెట్టుకున్న ఏప్రిల్ 1నే ‘భీమ్లా నాయక్’ను రిలీజ్ చేయడానికి మెండుగా అవకాశాలున్నాయి.

This post was last modified on February 2, 2022 2:27 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago