సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. తాజాగా ఆమెకు కరోనా సోకింది. పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండటం వల్ల ఐశ్వర్య వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఐశ్వర్య స్వయంగా వెల్లడించింది.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేస్తూ..`జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించండి, టీకాలు వేయించుకుని సురక్షితంగా ఉండండి. 2022..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను` అంటూ రాసుకొచ్చింది. దీంతో ఐశ్వర్య త్వరగా కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యవంతంగా తిరిగిరావాలని అభిమానులు, పలువురు ప్రముఖులు ఆకాక్షిస్తున్నారు.
కాగా, కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా గుర్తింపు పొందిన ధనుష్, ఐశ్వర్యలు.. ఇటీవలె తమ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసిన సంగతి తెలిసిందే. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట.. చాలా అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ దంపతులకు యాత్ర రాజా, లింగ రాజా అనే ఇద్దరు మగ పిల్లలు కూడా జన్మించారు.
కానీ, ఎవరూ ఊహించని విధంగా కొద్ది రోజుల క్రితం తాము విడాకులు తీసుకుంటున్నామని ధనుష్, ఐశ్వర్యలు అధికారికంగా ప్రకటించి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఈ స్టార్ కపుల్ విడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా అభిమానులు వీరి బ్రేకప్‌ను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
This post was last modified on February 2, 2022 9:38 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…