Movie News

రామారావుది కూడా అదే రూటు

స్టార్ హీరోలందరూ తమ సినిమాల రిలీజ్ డేట్స్‌ని అటూ ఇటూ తెగ మార్చేస్తున్నారు. దాంతో జనాలకే కాదు.. ఇండస్ట్రీలోనూ కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. ఎవరు ఏ డేట్‌కి ఫిక్సవ్వాలి, అప్పటికి ప్రశాంతంగా ఉంటుందా లేక మరేదైనా సినిమా పోటీకి వస్తుందా అంటూ అందరికీ టెన్షన్‌గానే ఉంటోంది. అందుకేనేమో.. ప్రతి ఒక్కరూ రెండేసి రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు.      

అందరికంటే ముందు రాజమౌళి రెండు డేట్స్ ప్రకటించాడు. అయితే ఇది, లేదంటే అది అన్నాడు. కానీ ఆ రెండూ వదిలేసి మధ్యలో మరో రోజుకి ఫిక్సయ్యాడు. భీమ్లానాయక్‌ కూడా దాన్నే ఫాలో అయ్యాడు. ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న వస్తానని తేల్చాడు. తర్వాత వరుణ్ తేజ్ ‘గని’ విషయంలోనూ అదే జరిగింది. మార్చ్‌ 18న రావాల్సిన ఈ సినిమాని ఫిబ్రవరి 25న కానీ మార్చ్ 4న కానీ విడుదల చేస్తామంటూ ప్రకటించారు.      

ఇప్పుడు రవితేజ కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. అతడు హీరోగా శరత్ మండవ డైరెక్షన్‌లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రూపొందుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాని మార్చ్ 25న విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే డేట్‌కి ఆర్‌ఆర్‌ఆర్ ఫిక్సయ్యింది. అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ నిర్ణయం మారింది. మార్చ్ 25న కానీ ఏప్రిల్ 15న కానీ ‘రామారావ్ ఆన్‌ డ్యూటీ’ని రిలీజ్ చేస్తామంటూ రెండు తేదీలు ప్రకటించింది టీమ్.        

ఒకవేళ రాజమౌళి నిర్ణయంలో కనుక మార్పు వస్తే రామారావ్ హ్యాపీగా ముందు చెప్పిన డేట్‌కే వచ్చేస్తాడు. లేదంటే రెండో తేదీకి వస్తాడు. ఏదైనా అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. అందుకే అలా తెలివిగా ప్లాన్ చేసుకున్నాడన్నమాట. వీళ్ల ముందు చూపు సంగతేమో కానీ.. ఇలా మార్చుకుంటూ పోవడం, ఒక్కోదానికీ రెండేసి డేట్లు ఇవ్వడం చూసి ఏ సినిమా ఎప్పుడొస్తుందో తెలియక ప్రేక్షకులైతే జుట్టు పీక్కోవడం ఖాయం. 

This post was last modified on February 1, 2022 11:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

38 minutes ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

59 minutes ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

1 hour ago

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

3 hours ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

3 hours ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

3 hours ago