భానుమతి సినిమా @ 1.5 కోట్లు

Bhanumati Ramakrishna

సినిమా హాళ్లు తెర‌వ‌క‌పోవ‌డంతో ఓటీటీ వైపు ఆశ‌గా చూస్తున్నారు నిర్మాత‌లు. వాళ్లు కూడా మంచి రేట్ల‌కే సినిమాల్ని కొన‌డానికి ముందుకు రావ‌డంతో, చిన్న సినిమాలు ఓటీటీ వైపుగా ట‌ర్న్ తీసుకుంటున్నాయి. అందులో భాగంగా మ‌రో సినిమా ఓటీటీ పంచ‌న చేరింది. అదే… ‘భానుమ‌తి రామ‌కృష్ణ‌’. న‌వీచ్ చంద్ర క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుద‌ల కానుంది.

అల్లు అర‌వింద్ సారథ్యంలో న‌డుస్తున్న ‘ఆహా’లో ఈ నెలాఖ‌రు నుంచి ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచుతారు. ఇప్పుడంటే చిన్న సినిమాలు ఓటీటీ వైపు ఆశ‌గా చూస్తున్నాయి గానీ.. ‘భానుమ‌తి… ఓటీటీ కోస‌మే తీసిన సినిమా. ఓటీటీ అవ‌స‌రాల్ని, వాటి శైలిని ముందుగానే అర్థం చేసుకుని ఈ సినిమాని నిర్మించారు. ఇప్పుడు ఓటీటీకి అమ్మేశారు. దాదాపు 1.5 కోట్ల‌కు ‘ఆహా’h హ‌క్కుల్ని కొనుగోలు చేసింది.

ఈ సినిమా బ‌డ్జెట్‌తో పోలిస్తే… గిట్టుబాటు అయిన‌ట్టే అని టాక్‌. అందాల రాక్ష‌సి త‌ర‌వాత న‌వీన్ చంద్ర‌కు స‌రైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.