బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైన్‌లో పెడుతూ మంచి జోష్ మీదున్నారు మెగాస్టార్. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటు బాబి మూవీకి కూడా ఒకే సమయంలో పని చేస్తూ యంగ్ హీరోలని మించి దూకుడు చూపిస్తున్నారు. వీటితో పాటు వెంకీ కుడుముల సినిమాని కూడా లైన్‌లో పెట్టారు. సినిమాల లైనప్ అయితే సూపర్బ్‌గా ఉంది కానీ ప్రతి సినిమా విషయంలోనూ ఓ ప్రశ్నకి జవాబు దొరకడం కష్టమవుతోంది. హీరోయిన్ ఎవరు అనేదే ఆ ప్రశ్న.
సీనియర్ హీరో కావడంతో ఆయన ఇమేజ్‌కి, పర్సనాలిటీకి తగిన హీరోయిన్‌ని పట్టుకోవడం కాస్త కష్టమవుతోందనే చెప్పాలి. ఎక్కువ ఆప్షన్స్ ఉండటం లేదు. అందుకే ఆచార్య, భోళాశంకర్ చిత్రాల్లో కాజల్, తమన్నాలని రిపీట్ చేస్తున్నారు. ‘గాడ్‌ఫాదర్’లో హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు. ప్రస్తుతానికైతే అనుష్క పేరు వినిపిస్తోంది. అలాగే వెంకీ కుడుముల చిత్రం విషయంలో త్రిష పేరు తెరమీదికొచ్చింది.
త్రిష కూడా గతంలో చిరంజీవితో నటించింది. సీనియర్ హీరోయిన్ల లిస్టులో ఉంది. అందుకే మరోసారి ఆమెని తీసుకుని ఉంటారనుకున్నారంతా. అయితే ఇప్పుడామె స్థానంలోకి మాళవికా మోహనన్ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘పేట’ మూవీతో ఫామ్‌లోకి వచ్చిన మాళవిక ‘మాస్టర్’ మూవీతో మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ధనుష్‌తో ‘మారన్’ మూవీ చేస్తోంది. ‘యుధ్ర’ అనే హిందీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లోనూ యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు తనని మెగా మూవీ కోసం లాక్ చేసినట్లు టాక్.
నిజానికి మాళవిక మెగాస్టార్‌కి మంచి జోడీనే. మంచి హైట్ ఉంటుంది. వయసు తక్కువే అయినా మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంది. గ్లామరస్‌గానూ బాగుటుంది. ట్రెడిషనల్‌గా సూటవుతుంది. యంగ్ హీరోలకీ, సీనియర్ యాక్టర్లకి కూడా సెట్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి తనలో. రీసెంట్‌గా బాబి, చిరంజీవిల సినిమాకి శ్రుతీహాసన్‌ని తీసుకున్నారనే వార్తలు వచ్చినప్పుడు కొంతమంది ఇష్టపడలేదు. శ్రుతి పర్సనాలిటీకి, మెగాస్టార్ పర్సనాలిటీకి మ్యాచ్ అవదని వారి అభిప్రాయం. అయితే మాళవికని సెలెక్ట్ చేయడమనేది నిజమైతే మాత్రం మంచి చాయిస్ అనే చెప్పాలి.
This post was last modified on February 1, 2022 11:50 am
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…