ప్రభాస్‌ని ప్యాన్ ఇండియా స్టార్‌ని చేసిన సినిమా ‘బాహుబలి’. కథ, కథనం, మేకింగ్, గ్రాఫిక్స్ అంటూ ప్రతి విషయంలో కొత్త కొత్త విషయాలను, విధానాలను ప్రేక్షకులకు పరిచయం చేసిందీ సినిమా. అంతే కాదు.. ఒక సినిమాని రెండు భాగాలుగా చూడటమనే ఎక్స్‌పీరియెన్స్ని కూడా రుచి చూపించింది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా కూడా టూ పార్ట్స్‌గా రావడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. సాలార్.
ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా తీర్చిదిద్దుతున్నాడు ప్రశాంత్. ప్రభాస్ డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఓ సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా ఎదిగాడు అని చూపించే పాత్ర ఒకటైతే.. దేశం కోసం ప్రాణాలొడ్డే వీరోచిత పాత్ర మరొకటని తెలుస్తోంది. ఇండో–పాక్ వార్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుందట. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె జర్నలిస్టుగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది.
ఇది చాలా బలమైన కథ కావడంతో ఒక్క పార్ట్‌లో చెప్పడం వీలు కాదని, మరో పార్ట్ తీస్తే బాగుంటుందని ప్రశాంత్ ఫీలవుతున్నాడని, దానికి నిర్మాత విజయ్ కిరగందూర్‌తో పాటు ప్రభాస్ కూడా ఈమధ్యనే ఓకే చెప్పాడని సమాచారం. ఆల్రెడీ ‘కేజీయఫ్’కి రెండో పార్ట్ తీశాడు ప్రశాంత్. అందుకే ఈ మూవీకి కూడా సెకెండ్ పార్ట్ తీయగలడని, సబ్జెక్ట్‌ని బాగా హ్యాండిల్ చేయగలడనే నమ్మకంతోనే వారు ఎస్ అన్నట్లు తెలుస్తోంది. ఈ యేడు అక్టోబర్‌లో ‘సాలార్’ విడుదల కానుంది. ఆ వెంటనే సెకెండ్ పార్ట్‌ని సెట్స్‌కి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయట.
చూస్తుంటే సౌత్‌లో టూ పార్ట్స్ ట్రెడిషన్ పెరుగుతున్నట్టనిపిస్తోంది. ‘పుష్ప’ సినిమాని కూడా సుకుమార్ మొదట ఒక మూవీగానే అనుకున్నాడు. తర్వాత రెండో పార్ట్‌కి రెడీ అయ్యాడు. ఇప్పుడు ప్రశాంత్ కూడా అదే చేస్తున్నాడు. నిజానికి మొదటి పార్ట్ సక్సెస్ అయితేనే రెండోదానిపై బజ్ ఏర్పడుతుంది. కానీ మన దర్శకులు ఒక సినిమా సగంలో ఉండగానే ఇంకో పార్ట్ తీయాలనే నిర్ణయం తీసుకుంటున్నారంటే వారి కాన్ఫిడెన్స్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ‘సాలార్’ తర్వాత ఎన్టీఆర్‌తో కమిట్‌మెంట్ ఉంది ప్రశాంత్‌కి. నిజంగా సెకెండ్ పార్ట్ కనుక తీయాలనుకుంటే ఆ మూవీ కాస్త లేటవుతుంది. తారక్ ఎలాగూ కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు కనుక ఆ గ్యాప్‌లో ప్రశాంత్ సాలార్ 2తో బిజీ అవుతాడా? ఒకవేళ అది పూర్తయ్యేలోపు తారక్ ఫ్రీ అయిపోతే చేస్తున్న సినిమా వదిలి ప్రశాంత్ ఈ సినిమా మొదలుపెట్టలేడు కాబట్టి మరింత లేటవుతుందా? అసలు ఈ రెండు పార్ట్స్ స్టోరీ నిజమేనా లేక పుకారా? వీటన్నింటికీ జవాబులు ప్రశాంత్ నీల్ చెప్పాల్సిందే.
This post was last modified on January 31, 2022 9:33 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…