టాలీవుడ్లో కొన్ని బేనర్లకు ఆస్థాన దర్శకులున్నారు. ఆ దర్శకులను ఆ సంస్థలు చాలా బాగా చూసుకుంటాయి. సినిమాకు సంబంధించి వాళ్లేం అడిగినా సమకూరుస్తాయి. కేవలం పారితోషకాలతో సరిపెట్టకుండా లాభాల్లో వాటాలు, ప్రత్యేక బహుమతులు ఇస్తాయి. ఆ దర్శకులు ఆ బేనర్లలో తెరకెక్కే సినిమాలకు సంబంధించి అన్నీ తామై వ్యవహరిస్తారు. హారిక హాసిని క్రియేషన్స్ బేనర్‌కు త్రివిక్రమ్.. మైత్రీ మూవీ మేకర్స్‌కు సుకుమార్ అలాంటి దర్శకులే.
దిల్ రాజు బేనర్‌కు సంబంధించి ఇలాంటి దర్శకులు ఒకరికి మించే ఉన్నారు. హరీష్ శంకర్, వేణు శ్రీరామ్, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులకు అక్కడ మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఐతే ఈ దర్శకులందరి ప్రతిభ తెలిసిందే. వాళ్ల సినిమాల సక్సెస్‌ల గురించీ విదితమే. ఐతే ఇప్పుడీ కోవలో మరో దర్శకుడు చేరాడు. అతనే.. రమేష్ వర్మ. అతను మరీ పేరున్న దర్శకుడు కాదు. అంత గొప్ప సినిమాలేమీ తీయలేదు.
సక్సెస్ రేట్ కూడా తక్కువే. కానీ ఒక బేనర్ అతణ్ని ఆస్థాన దర్శకుడిని చేసింది. అతడిని గొప్పగా చూసుకుంటోంది. ఆ బేనరే.. హవీష్ ప్రొడక్షన్స్.విజయవాడ ప్రాంతంలో మంచి పేరున్న కేఎల్ఎం యూనివర్శిటీ యజమానే హవీష్ ప్రొడక్షన్స్ అధినేత. ఆయన పేరు కోనేరు సత్యనారాయణ. ఈయన తనయుడు హవీష్ హీరోగా ఐదారు సినిమాలు చేశాడు. కానీ ఏవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. అయితే ఈ మధ్య అతను హీరోగా సినిమాలు ఆపేశాడు. ఈ సంస్థ వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. కొన్నేళ్ల కిందట వచ్చిన ‘రాక్షసుడు’ ఆ సంస్థలో తొలి హిట్.
తమిళ బ్లాక్‌బస్టర్ ‘రాక్షసన్’కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని రమేష్ వర్మ డైరెక్ట్ చేశాడు. అతను ఇంతకుముందు ఒక ఊరిలో, వీర, అబ్బాయితో అమ్మాయి లాంటి డిజాస్టర్ మూవీస్ తీశాడు. ఒక కొరియన్ మూవీని కాపీ కొట్టి తీసిన ‘రైడ్’ ఓ మాదిరిగా ఆడింది. మధ్యలో పూర్తిగా ఫామ్ కోల్పోయిన అతను.. రీమేక్ మూవీ అయిన ‘రాక్షసుడు’తో హిట్ కొట్టడంతో సుడి తిరిగింది. అతడి దర్శకత్వంలో ‘ఖిలాడి’ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించింది హవీష్ ప్రొడక్షన్స్.
ఈ సినిమా మంచి లాభాలకు అమ్ముడవడంతో ఈ దర్శకుడిపై కానుకల వర్షం కురిపిస్తున్నారు నిర్మాత. ఆల్రెడీ ఇల్లు ఇచ్చిన ఆయన.. ఇప్పుడు కోటి రూపాయలకు పైగా ఖరీదైన రేంజ్ రోవర్ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు. పైన చెప్పుకున్న దర్శకులతో పోలిస్తే రమేష్ సక్సెస్ రేట్ అంతంతమాత్రం. తన సొంత ప్రతిభతో ఇప్పటిదాకా హిట్టే కొట్టలేదు. ఇలాంటి దర్శకుడికి ఇంత వైభవం ఏంటి అని సహ దర్శకులు అసూయ చెందే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ‘ఖిలాడి’ హిట్టయితే పరిస్థితేంటా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ దర్శకుడితో హవీష్ ప్రొడక్షన్స్ ‘రాక్షసుడు-2’ సహా మరికొన్ని చిత్రాలను ప్లాన్ చేయడం విశేషం.
This post was last modified on January 30, 2022 4:26 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…