అఖండతో ఎవ్వరూ ఊహించని భారీ విజయాన్నందుకున్నాడు బోయపాటి శ్రీను. దీనికి ముందు ఆయన్నుంచి వచ్చిన వినయ విధేయ రామ పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు బాలయ్య కూడా వరుస డిజాస్టర్ల తర్వాత బోయపాటితో జట్టు కట్టడంతో మొదట్లో మరీ అంచనాలేమీ లేవు ఈ సినిమాపై. కానీ రిలీజ్ టైంకి హైప్ వచ్చింది. ఇక విడుదల తర్వాత అఖండ సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇంత పెద్ద హిట్ కొట్టాక బోయపాటికి క్రేజీ ఆఫర్లు వస్తాయనే అంతా అనుకున్నారు. అల్లు అర్జున్ అని, చిరంజీవి అని బోయపాటి తర్వాతి సినిమా హీరో గురించి రకరకాల ఊహాగానాలు నడిచాయి. బన్నీతో సినిమా దాదాపు ఓకే అనే అన్నారు. కానీ ఏవో కారణాలతో ఆ సినిమా కార్యరూపం దాల్చేలా లేదు. మరోవైపు చిరంజీవికి చాలా కమిట్మెంట్లు ఉండటంతో బోయపాటికి ఓకే చెప్పినా సినిమా వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదు.
మిగతా పెద్ద హీరోల్లో ఎవరూ ఖాళీగా లేరు. ఈ పరిస్థితుల్లో బోయపాటి కాస్త రాజీ పడుతున్నట్లు సమాచారం. అతను యువ కథానాయకుడు రామ్‌తో జట్టు కట్టబోతున్నాడట. అతడి కోసం మంచి మాస్ కథ ఒకటి రాస్తున్నాడట. తక్కువ వ్యవధిలో ఈ సినిమా పూర్తి చేయాలని బోయపాటి భావిస్తున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్లో సినిమా చేయడానికి ఓ నిర్మాత కూడా రెడీగా ఉన్నాడట.
ఇస్మార్ట్ శంకర్‌తో రామ్ రేంజ్ కొంచెం పెరిగింది. ప్రస్తుతం అతను లింగుస్వామితో వారియర్ అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా బాగా ఆడితే అతడి రేంజ్ ఇంకా పెరగొచ్చు. ఈ ఆలోచనతోనే ఇప్పుడు తన స్థాయికి రామ్ తక్కువే అయినా సినిమా చేయడానికి బోయపాటి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇది పూర్తి చేశాక చిరంజీవి లేదా బాలయ్యతో అతను సినిమా చేసే అవకాశముంది.
This post was last modified on January 30, 2022 10:14 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…