Movie News

హరీష్ శంకర్ బాలీవుడ్ డెబ్యూ!

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కి చెందిన చాలా మంది దర్శకులు హిందీలో సినిమాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి, వి.వి.వినాయక్ ఇలా చాలా మంది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఓ రీమేక్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది. 

గత రెండేళ్లుగా హరీష్ శంకర్ నుంచి ఒక్క సినిమా కూడా కాలేదు. పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. పవన్ కి ఉన్న వేరే కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యమవుతుంది. ఈ బ్రేక్ ను ఇతర స్క్రిప్ట్స్ కోసం వినియోగిస్తున్నారు హరీష్ శంకర్. ఇప్పటికే ‘ఏటీఎం’ అనే వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేశారు. దిల్ రాజుతో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ కి హరీష్ శంకర్ కథ అందిస్తున్నారు. 

సి. చంద్ర మోహన్ అనే వ్యక్తి ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు హరీష్ శంకర్ ను బాలీవుడ్ కి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు దిల్ రాజు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. 

ఇప్పటికే హరీష్ శంకర్ బాలీవుడ్ కి తగ్గట్లుగా ‘డీజే’ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఓ యంగ్ హీరో బాలీవుడ్ రీమేక్ లో నటించబోతున్నారట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది. తెలుగులో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టినప్పటికీ.. డివైడ్ టాక్ తెచ్చుకుంది. మరి బాలీవుడ్ లో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి! 

This post was last modified on January 29, 2022 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

55 minutes ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

2 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

3 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

3 hours ago

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

5 hours ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

5 hours ago