శ్యామ్ సింగరాయ్.. 2021 సంవత్సరానికి టాలీవుడ్ చివరి హిట్. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు టాక్‌తోనే మంచి ఫలితాన్నందుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల గొడవ కారణంగా బాక్సాఫీస్ దగ్గర కొంచెం ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ సినిమా అంతిమంగా మంచి విజయాన్నందుకుంది.
శ్యామ్ సింగ రాయ్ థియేట్రికల్ హక్కులు రూ.20 కోట్లకు అమ్మితే అంతకు ఐదారు కోట్లు ఎక్కువగానే షేర్ రాబట్టిందీ సినిమా. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌లోనూ నాని సినిమా సత్తా చాటుతోంది. నెట్ ఫ్లిక్స్‌లో ఇటీవలే విడుదలైన శ్యామ్ సింగ రాయ్.. అక్కడా అదరగొడుతోంది. ఈ చిత్రం గత వారానికి నెట్ ఫ్లిక్స్‌లో అత్యధిక వరల్డ్ వైడ్ వ్యూయర్ షిప్ తెచ్చుకున్న చిత్రాల్లో టాప్-3 స్థానంలో నిలవడం విశేషం.
నెట్ ఫ్లిక్స్‌లో గత వారం ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమా ఇదే. నెట్ ఫ్లిక్స్ టాప్-3లో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ సినిమా కూడా శ్యామ్ సింగ రాయే. నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు వరల్డ్ వైడ్ వివిధ భాషల్లో ఎన్నో క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లను దించుతుంటుంది. దానికి వేరే దేశాల్లోనే సబ్‌స్క్రైబర్లు ఎక్కువ.
ఇండియన్ సబ్ స్క్రైబర్స్ తక్కువే. అయినా సరే.. గత వారం నెట్ ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూయర్ షిప్ తెచ్చుకున్న టాప్-3 మూవీగా నిలవడం గొప్ప విషయం. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన శ్యామ్ సింగ రాయ్.. అతడికి అత్యావశ్యక విజయాన్ని అందించింది. వి, టక్ జగదీష్ చిత్రాలు ఓటీటీలో రిలీజై నిరాశ పరిచాక.. ఈ చిత్రం థియేటర్లలో, అలాగే ఓటీటీలో మంచి ఫలితాన్నందుకుని అతడికి ఊరటనిచ్చింది. రాహుల్ సంకృత్యన్ రూపొందించిన ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మించాడు. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి నటించారిందులో.
This post was last modified on January 27, 2022 9:55 am
హిట్ అవుతుందనుకుంటే ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న అమరన్ నెల రోజులవుతున్నా ఇంకా బాక్సాఫీస్…
నాగచైతన్యతో వైవాహిక జీవితం విడాకుల రూపంలో ఎప్పుడో ముగిసిపోయినా దాని తాలూకు నీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయంటోంది సమంతా. ఇటీవలే…
ఐపీఎల్-2025 మెగా వేలం ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. వేలం కోసం 577 మందిని షార్ట్ లిస్ట్ చేయగా అందులో…
అక్కినేని నాగార్జున.. టాలివుడ్ సినీ ఇండస్ట్రీలో ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. 6 పదుల వయసు లో కూడా కుర్ర…
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు జగన్ ఈవీఎంలపై దండయాత్ర మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. ఏదో జరిగింది..కానీ ఆధారాల్లేవ్…అంటూ…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సంచలన…