ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాట లిరికల్ వీడియో రిలీజవ్వడం ఆలస్యం.. అందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకరినొకరు పట్టుకుని అదిరిపోయే సింక్‌లో చేసి హుక్ స్టెప్ సూపర్ పాపులర్ అయిపోయింది. ఆ స్టెప్ ఎంత వైరల్ అయిందో.. ఎన్ని లక్షల మంది ఆ స్టెప్‌ను అనుకరిస్తూ వీడియోలు చేశారో లెక్కలేదు. దేశవిదేశాల్లో ఆ స్టెప్ పాపులర్ అయింది.
ఇప్పుడు ఒక ఊహించని జంట ఈ నాటు స్టెప్ వేసింది. అందులో ఒకరు ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణే కాగా.. ఇంకొకరు అగ్ర కథానాయిక కీర్తి సురేష్ కావడం విశేషం. కీర్తి ప్రధాన పాత్ర పోషించిన గుడ్ లక్ సఖి ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. నిజానికి చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి రావాల్సింది. కానీ ఆయన అనుకోకుండా కరోనా బారిన పడగా.. ఆ స్థానంలో తనయుడు చరణ్ వచ్చాడు.
తాను తన తండ్రికి మెసెంజర్‌గా ఇక్కడికి వచ్చినట్లు చరణ్ చెప్పడం విశేషం. తన ప్రసంగానికి ముందు చరణ్ స్టేజ్ మీదికి రాగా.. కీర్తి తనతో కలిసి నాటు స్టెప్ వేయాలని చరణ్‌ను కోరింది. అందుకు మెగా పవర్ స్టార్ అంగీకరించాడు. ఇద్దరూ కలిసి కొన్ని క్షణాల పాటు నాటు నాటు పాటకు డ్యాన్స్ వేశాడు. ఇది అభిమానులను అమితంగా ఆకట్టుకుంది.
మహానటితో సీతారామరాజు నాటు స్టెప్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. గుడ్ లక్ సఖి గురించి చరణ్ మాట్లాడుతూ కీర్తి సురేష్, నగేష్ కుకునూర్, జగపతిబాబు, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా ఇంతమంది పేరున్న వాళ్లు కలిసి పని చేస్తున్న సినిమా చిన్నది కాదని.. ఇది పెద్ద రేంజ్ మూవీ అని అన్నాడు. ఈ చిత్రానికి సోలో రిలీజ్ డేట్ దక్కడం ఆనందదాయకమని.. సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on January 27, 2022 9:50 am
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…