Movie News

హిట్టు లేదని పేరు మార్చుకున్నాడు

అదిత్ అరుణ్.. టాలీవుడ్ యంగ్ హీరో. అందంగా ఉంటాడు. బాగా నటిస్తాడు. వాయిస్ కూడా బాగుంటుంది. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. జెనీలియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కథ’ సినిమాతో అతను తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా వచ్చింది 2009లో. అంటే అదిత్ నటుడిగా అరంగేట్రం చేసి పుష్కరం దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా సరైన హిట్ రాక హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.

తొలి సినిమా ‘కథ’ పెద్ద ఫ్లాప్. ఆ తర్వాత ‘హ్యాపీ డేస్’ తమిళ రీమేక్‌లో నటిస్తే అది కూడా సరిగా ఆడలేదు. అయినా అదిత్‌కు అవకాశాలేమీ ఆగిపోలేదు. తుంగభద్ర, 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘా, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.. ఇలా పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. ‘గరుడవేగ’ సహా కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లోనూ నటించాడు. కానీ ఏవీ అనుకున్నంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు.

త్వరలోనే ‘కొండా’ సినిమతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అదిత్.. కెరీర్లో ఈ దశలో తన పేరు మార్చుకోవడం గమనార్హం.అదిత్ అరుణ్ అన్న తన పేరును త్రిగుణ్‌గా మార్చుకున్నాడీ యంగ్ హీరో. మామూలుగా సినిమా వాళ్లు తమకు అదృష్టం కలిసి రాలేదనుకున్నపుడు న్యూమరాలజీ నిపుణుల్ని కలుస్తుంటారు. తమ పేర్లలో అదనపు అక్షరాలను చేర్చుకోవడం లాంటివి చేస్తుంటారు. పేర్లను కొద్దిగా మార్చుకుంటూ కూడా ఉంటారు. కానీ ఇలా ఏకంగా పేర్లే మార్చుకునేవాళ్లు మాత్రం అరుదు.

కెరీర్ ఆరంభంలోనే అసలు పేరును పక్కన పెట్టి ఆకర్షణీయమైన స్క్రీన్ నేమ్ పెట్టుకోవడం వేరే కథ. చిరంజీవి, మోహన్ బాబు, రంభ లాంటి వాళ్లు ఇలా పేర్లు మార్చుకున్న వాళ్లే. కానీ ఒక పేరుతో పాపులర్ అయి.. ఇప్పుడు అదిత్ అరుణ్‌లా పేర్లు మార్చుకున్న వాళ్లు మాత్రం పెద్దగా కనిపించరు. అయినా సరైన సినిమాలు ఎంచుకుని రాత మార్చుకోవాలి కానీ.. ఇలా పేరు మార్చుకుంటే ఏం లాభం అని అదిత్ అరుణ్‌పై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ‘కొండా’ సినిమా ట్రైలర్ రిలీజైన టైంలోనే అదిత్ ఇలా పేరు మార్చుకోవడంతో ఈ కౌంటర్లు మరింత ఎక్కువవుతున్నాయి.

This post was last modified on January 26, 2022 2:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago