రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు కేవలం ‘కంటెంట్’ను నమ్ముకునే సినిమాలు చేసేవాడు. ప్రచారం గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఆయనది దాదాపు మూడు దశాబ్దాల కెరీర్ కాగా..ఇందులో తొలి అర్ధభాగంలో వర్మ అసలు మీడియాలోనే కనిపించేవాడు కాదు. అప్పట్లో మీడియా హడావుడి కూడా పెద్దగా ఉండేది కాదు. సైలెంటుగా తన పని తాను చేసుకుపోయేవాడు. ఏం మాట్లాడేవాడు కాదు. ఆయన సినిమానే మాట్లాడేది. కేవలం వర్మ పేరు చూసి జనం థియేటర్లకు పరుగులు పెట్టేవాళ్లు.
కానీ దర్శకుడిగా తన పనితనం తగ్గుతున్న దశలో ఆయన ఫోకస్ పబ్లిసిటీ మీదికి మళ్లింది. ఒక దశ వరకు సినిమాల్లో కొంత మేర విషయం ఉండేది. దానికి పబ్లిసిటీ కూడా కలిసొచ్చేది. వివాదాస్పద అంశాలను ఎంచుకుని సినిమాలు తీయడం.. ఏదో ఒక వివాదం రాజేయడం.. సినిమాకు మంచి పబ్లిసిటీ తెచ్చుకుని ఓపెనింగ్స్ సాధించడం.. ఇదీ వరస. ఐతే సినిమాలో ఎంతో కొంత విషయం ఉన్నంత వరకు ఇది వర్కవుటైంది.కానీ గత దశాబ్ద కాలంలో వర్మ దర్శకుడిగా పూర్తిగా పతనం అయిపోయాడు.
డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఆయనకు దండం పెట్టేసి పారిపోయే పరిస్థితి వచ్చింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వరకు ఆయన పబ్లిసిటీ గిమ్మిక్కులు పనిచేశాయి. కానీ తర్వాత వర్మను పూర్తిగా జనాలు పట్టించుకోవడం మానేశారు. పబ్లిసిటీ పరంగా ఎన్ని వెర్రితలలు వేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. చివరగా వర్మ నుంచి వచ్చిన మర్డర్, కరోనా వైరస్ లాంటి చిత్రాలకు థియేట్రికల్ రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. అన్ని రకాలుగా తన పనైపోయిందని తెలుస్తున్నా వర్మ మాత్రం సినిమాలు ఆపడం లేదు.
ఇప్పుడు ఆయన్నుంచి ‘కొండా’ అనే సినిమా రాబోతోంది. వరంగల్ జిల్లాకు చెందిన భార్యాభర్తలైన రాజకీయ నేతలు కొండా మురళి-కొండా సురేఖల మీద తీసిన సినిమా ఇది. ఎప్పట్లాగే హడావుడిగా సినిమాను చుట్టేశాడు వర్మ. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో ప్రేక్షకులను ఆకర్షించే అంశాలేవీ కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ముందు నుంచి కూడా ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తేమీ కనిపించడం లేదు. ఇలా అయితే కష్టమని వర్మ ఈ సినిమా విడుదలకు ఏవో అడ్డంకులు ఎదురైనట్లు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైలర్ ఆపడానికి పోలీసులు ప్రయత్నించినట్లు, దీని వెనుక రాజకీయ నాయకులున్నట్లుగా ట్వీట్లు వేశాడు వర్మ.
అంతటితో ఆగకుండా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన సినిమా విడుదల ఆగదంటూ కొండా సురేఖతో వీడియో బైట్ ఇప్పించాడు. ఐతే గతంలో వర్మ ఎన్నోసార్లు విషయం లేకుండా పబ్లిసిటీ గిమ్మిక్కులతో జనాలను ఫూల్స్‌ను చేశాడు. దీనికి ప్రతీకారమా అన్నట్లు ఇప్పుడు ఆయనేం చేసినా పట్టించుకోవడం లేదు జనాలు. వర్మను ఇగ్నోర్ చేయడమే ఆయనకు సరైన శిక్ష అని అందరికీ అర్థమైపోయి సైలెంటుగా ఉంటున్నారు. ‘కొండా’ సినిమా విషయంలోనూ ఎక్కడా చప్పుడు లేదు. కానీ వర్మ మాత్రం ఇదో పెద్ద కాంట్రవర్శల్ మూవీ అన్నట్లు, దాన్ని అడ్డుకోవడానికి ఏవో ప్రయత్నాలు జరిగిపోతున్నట్లు ప్రొజెక్ట్ చేసి సినిమాకు పబ్లిసిటీ తీసుకురావాలని చూస్తున్నాడు. కానీ జనాలకిది కామెడీగా అనిపించి లైట్ తీసుకుంటున్నారు.
This post was last modified on January 26, 2022 2:08 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…