కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ తెలుగులో ‘సార్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పుడు సడెన్ గా షూటింగ్ కి బ్రేక్ పడింది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిందని చెబుతోంది చిత్రబృందం. కానీ అసలు కథ వేరే అట.
కొన్నిరోజులుగా ధనుష్ ఆరోగ్యం పాడవ్వడంతో వెంటనే టెస్ట్ లు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ అని తేలిందట. వెంటనే షూటింగ్ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. వారం, పది రోజుల పాటు ఆయన షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. ఆ తరువాత షూటింగ్ మొదలుపెడతారేమో చూడాలి. ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే జరగనుందని సమాచారం.
కథ ప్రకారం.. భారీ సెట్లు, డిఫరెంట్ లొకేషన్స్ తో పని లేదని తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ధనుష్ నటిస్తోన్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మధ్యనే ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకే హోటల్ లో ఉంటున్నారని సమాచారం. ఐశ్వర్య ఓ సాంగ్ షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తోంది.
This post was last modified on January 24, 2022 5:38 pm
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…