కారు షోరూంలోకి ఒక రైతు వెళ్లాడు. కారు ధర అడిగాడు. దీంతో సిబ్బంది ఆయనను ఇన్సల్ట్ చేశారు. “కారు ధర చెప్పాలా? ఇది పావలా అర్ధ రూపాయి కాదు!“ అంటూ అవహేళనగా మాట్టాడారు. ఆ తర్వాత.. ఇక్కడ చిరంజీవి నటించిన సినిమాలోని ఒక సీన్ కనిపించింది. దీంతో సిబ్బంది అవాక్కయ్యారు.. స్నేహం కోసం సినిమాలో పంచకట్టులో.. చిరంజీవి, విజయ్ కుమార్ కలిసి ఓ కార్ల షోరూమ్కు వెళ్తారు.
వారిని చూసి అక్కడి మేనేజర్ అవమానిస్తాడు. కారు కొనే ముఖాలేనా? అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత.. గోనె సంచిలో నుంచి డబ్బుల కట్టలు తీయగా ఆశ్చర్యానికి గురై తన తప్పును తెలుసుకుని కారును విక్రయిస్తాడు. ఇలాంటి సీనే కర్ణాటకలోని ఓ మహీంద్రా షోరూమ్లో జరిగింది. మహీంద్రా బొలెరో కొనేందుకు ఓ రైతు షోరూమ్కు వెళ్లగా.. అక్కడి సేల్స్మ్యాన్ అవమానించాడు.
కర్ణాటక, తుముకూర్లోని ఓ మహీంద్రా కార్ల షోరూమ్కు కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్కు కొనేందుకు వెళ్లారు. లోపలకు వెళ్లిన క్రమంలో వారి వస్త్రాలంకరణను హేళన చేస్తూ అక్కడి సేల్స్మ్యాన్ అవమానించాడు. కారు ధర మీరనుకున్నట్లు 10 రూపాయలు కాదంటూ వారిని తక్కువ చేసి మాట్లాడాడు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు. రైతును ఉద్దేశిస్తూ సేల్స్మ్యాన్ అసభ్యకరంగా మాట్లాడాడు.
తమ వస్త్రధారణ చూసి అవమానించిన సేల్స్మ్యాన్కు రైతు.. ధీటైన సమాధానమిచ్చారు. గంటలో రూ.10 లక్షలు తీసుకొచ్చి వెంటనే కారు డెలివరీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు చేసిన ప్రతీకార చర్యతో షాక్కు గురైన షోరూమ్ సిబ్బంది.. మూడు రోజుల్లో కారు డెలివరీ చేస్తామని రైతుకు, ఆయన స్నేహితులకు తెలిపారు. అక్కడి నుంచి వెళ్లిన రైతు.. తుముకూర్లోని తిలక్నగర్ పోలీస్ స్టేషన్లో షోరూమ్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. చివరకు షోరూమ్ సేల్స్మ్యాన్, ఇతర ఉద్యోగులు కెంపెగౌడకు క్షమాపణలు చెప్పారు. రాతపూర్వక క్షమాపణ పత్రాన్ని అందించారు. అనంతరం ఇరువర్గాలతో మాట్లాడిన పోలీసులు.. వివాదానికి ముగింపు పలికారు. ప్రస్తుతం ఈ ఘటన తాలూకు వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది.
This post was last modified on January 23, 2022 8:19 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…