ఇండియన్ సినిమాలో దశాబ్దాల నుంచి బాలీవుడ్‌దే ఆధిపత్యం. వేరే దేశాల వాళ్లు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే అనుకుంటారు. ఇక్కడ వేర్వేరు భాషల్లో సినిమాలు తెరకెక్కుతుంటాయని.. బాలీవుడ్ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ లాంటి పేరున్న ఇండస్ట్రీలున్నాయని కూడా ఒకప్పుడు తెలిసేదే కాదు. ఇక బాలీవుడ్ వాళ్లు కూడా వేరే భాషల చిత్రాలను తక్కువగా చూసే పరిస్థితి ఉండేది. మన సినిమాల్ని చూసి వెటకారాలు కూడా చేసేవారు. సౌత్ సినిమాలను అసలుతమకు పోటీగానే ఎప్పుడూ భావించేవారు కాదు.
వసూళ్ల పరంగా చూసినా, అవార్డుల్లో చూసినా ఆధిపత్యమంతా బాలీవుడ్ వాళ్లదే. కానీ ఇదంతా ‘బాహుబలి’కి ముందు కథ. ఆ సినిమా ఉత్తరాదిన ప్రభంజనం సృష్టించాక కథ మొత్తం మారిపోయింది. జియో ఇంటర్నెట్ పుణ్యమా అని సౌత్ మసాలా రుచేంటో ఉత్తరాది వాళ్లకు బాగా అర్థమైంది. కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలతో నార్త్ ఇండియాలో సౌత్ సినిమాల హవా ఇంకా పెరిగిపోయి హిందీ సినిమాల అస్తిత్వమే ప్రమాదంలో పడింది.
ఒకప్పుడు హిందీ సినిమాలకు రిలీజ్ డేట్లు ఖరారు చేసే విషయంలో బాలీవుడ్ వాళ్లకు ఎలాంటి తలనొప్పులూ ఉండేవి కావు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని డేట్లు ఖరారు చేసేవారు. ఒక పెద్ద సినిమాకు ఒక డేట్ ఇస్తే.. దానికి అనుగుణంగా ఇంకో పెద్ద సినిమా గ్యాప్ ఇచ్చి రిలీజ్ డేట్ ఖరారు చేసుకునేది. హిందీలో సినిమా ఆరంభానికి ముందే విడుదల తేదీలు ఖరారవుతాయన్న సంగతి తెలిసిందే. ఎవరికీ ఎవరి నుంచీ ఇబ్బంది రాకుండా గ్యాప్ ఇచ్చి విడుదల తేదీలు ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు సౌత్ సినిమాలతో వారికి చావొచ్చి పడింది. వరుసబెట్టి ఇక్కడ పాన్ ఇండియా సినిమాలు తయారవుతున్నాయి.
వాటిని బాలీవుడ్ వాళ్లు పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితి లేదు. సౌత్ సినిమాల ధాటిని బాలీవుడ్ సినిమాలే తట్టుకునే పరిస్థితి లేదిప్పుడు. మన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ను పోయిన దసరాకు రిలీజ్ చేయాలనుకుంటే.. తన ‘మైదాన్’ సినిమాకు ఇబ్బందని బోనీకపూర్ ఎలా ఏడ్చాడో తెలిసిందే. కరోనాతో అల్లాడిపోయిన బాలీవుడ్ నిర్మాతలు.. కొత్త ఏడాదిలో మంచి డిమాండ్ ఉన్న సమ్మర్ డేట్లను ముందే రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్-2 లాంటి పాన్ ఇండియా సినిమాలతో చిక్కొచ్చి పడింది. వాటికి ఎదురెళ్లలేక.. సౌత్ సినిమాల డేట్లను అనుసరించి తమ చిత్రాల విడుదల తేదీలు మార్చుకోలేక సతమతం అవుతున్నారు. దక్షిణాది చిత్రాలను చూసి బాలీవుడ్ వాళ్లు ఇంతలా భయపడే పరిస్థితి వస్తుందని కొన్నేళ్ల ముందు ఎవరైనా ఊహించి ఉంటారా?
This post was last modified on January 23, 2022 6:46 pm
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…