మహానటి సినిమాతో వచ్చిన పేరును నిలబెట్టుకునేలా సినిమాలు చేయడంలో కీర్తి సురేష్ విఫలమైన మాట వాస్తవం. ఒక్క సినిమాతో అంత పేరు, ఇమేజ్ రావడం అరుదుగా జరుగుతుంటుంది. ఓవైపు స్టార్ల సరసన కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా లైన్లో పెట్టింది. అవన్నీ ప్రకటించినపుడు బాగానే అనిపించాయి. కానీ తీరా తెర మీద బొమ్మ పడ్డప్పుడు తేలిపోయాయి.
పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తోడు కీర్తి నటించిన వేరే చిత్రాల్లో కూడా తన పాత్రలు క్లిక్ కాలేదు. వరుసగా ఆమెకు పరాజయాలు తప్పలేదు. ఐతే ఇప్పుడో సినిమా మాత్రం కీర్తి అభిమానుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తూ అంచనాలను పెంచేలా చేస్తోంది. అదే.. సాని కాయిదం.
ఈ తమిళ చిత్రం ఫస్ట్ లుక్ చూసినపుడే అందరూ స్టన్ అయిపోయారు. దర్శకుడు సెల్వ రాఘవన్ మరో కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో.. వీళ్లిద్దరూ కిరాతకంగా హత్యలు చేసే కిల్లర్లుగా కనిపించనుండటం విశేషం. కీర్తి, సెల్వల లుక్స్ చూస్తే జనాలకు దండుపాళ్యం గుర్తుకొచ్చింది. ఇంత వయొలెంట్ మూవీలో కీర్తి ఎలా ఫిట్ అవుతుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ముందు థియేటర్లలోనే సాని కాయిదం చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. పరిస్థితులు మారిపోవడంతో ఆలోచన మారిపోయింది. దీన్ని ఓటీటీ రిలీజ్‌కు ఇచ్చేశారు.
కీర్తి పెంగ్విన్ మూవీని రిలీజ్ చేసిన అమేజాన్ ప్రైమే దీన్ని కూడా విడుదల చేయబోతోంది. ఐతే రిలీజ్‌కు కొంచెం టైం పట్టేలా ఉంది. మంచి రేటుకే సినిమాను కొన్నదట ప్రైమ్. ఈ మధ్యే రిలీజైన రాకీ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తొలి సినిమా రిలీజ్ కాకముందే అతడికి ఈ చిత్రంతో పాటు ధనుష్ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం రావడం విశేషం.
This post was last modified on January 22, 2022 10:27 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…