టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య-సమంత తమ నాలుగేళ్ల వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 2న వీరు అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చై-సామ్ విడిపోయి మూడు నెలలవుంది. ఇప్పటికీ వారి విడాకుల విషయం హాట్ టాపిక్ గానే ఉంది. అభిమానులు మాత్రం వారు మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా సమంత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి విడాకుల ప్రకటనకు సంబంధించిన పోస్ట్ ను డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే చైతు మాత్రం తన ఇన్స్టాగ్రామ్ లో విడాకుల ప్రకటనను అలానే ఉంచారు. ఒకవేళ కలిసే ఉద్దేశం ఉంటే ఆయన కూడా డిలీట్ చేసేవారు కదా.. కానీ ఇక్కడ ఆలా జరగలేదు.
సమంత సోషల్ మీడియా అకౌంట్ నుంచి మాత్రమే పోస్ట్ డిలీట్ అయింది. సామ్ తన ఇన్స్టాగ్రామ్ ను క్లీన్ చేసే ప్రాసెస్ లో విడాకుల ప్రకటన డిలీట్ అయి ఉంటుందని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా.. చైతు-సమంత తిరిగి కలిస్తే చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గానే ‘బంగార్రాజు’ సినిమాతో సక్సెస్ అందుకున్నారు చైతు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు, మూడు సినిమాలు.. ఒక వెబ్ సిరీస్ ఉంది. మరోపక్క సమంత ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేయబోతుంది. త్వరలోనే ఈ సినిమాలన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాయి.
This post was last modified on January 21, 2022 10:41 am
ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక…
పండగ సినిమాల్లో ఖర్చుపరంగా చూసుకుంటే తక్కువ బడ్జెట్ తో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు డిమాండ్ పెంచుకునే స్థాయికి చేరుకుంది.…
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాటతో చోటుచేసుకున్న విషాదం యావత్ దేశాన్ని…
తలా అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే అజిత్ ఏడాదికి ఒక సినిమా చేయడమే మహా గగనం. అలాంటిది కేవలం మూడు…
జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలు భారత క్రికెట్లో కీలక చర్చకు కారణమవుతున్నాయి. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బందులు…
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన…