టాలీవుడ్ భారీ కాయుల్లో ప్రభాస్ ఒకడు. అంతటి భారీ కాయాన్ని ఫిట్‌గా మెయింటైన్ చేయడం అంత సులువేమీ కాదు. భోజన ప్రియుడు అయిన ప్రభాస్‌కు ఫిట్నెస్ మెయింటైన్ చేయడం మరీ కష్టం. అతను షూటింగ్ లేకుండా కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాడంటే షేప్ ఔట్ అయిపోతుంటాడు. ముఖంలోనూ మార్పులు వచ్చేస్తుంటాయి. ఒళ్లు చేస్తుంటాడు. ఇలా పలు సందర్భాల్లో షూటింగ్ గ్యాప్స్ మధ్య అతను కొంచెం షేప్ ఔట్ అయి కనిపించడం గమనించే ఉంటారు.
చివరగా ‘సాహో’ చిత్రీకరణ ముగిశాక ప్రభాస్ కాస్త అదుపు తప్పాడు. ఆ సినిమా ప్రమోషన్లలో అతడి లుక్ ఏమంత బాగా లేదు. ఐతే తర్వాత కష్టపడి ఒళ్లు తగ్గించుకున్నాడు. రాధాకృష్ణ కుమార్ సినిమా మొదలయ్యే సమయానికి మంచి లుక్‌లోకి వచ్చాడు. తర్వాత అదే లుక్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు.
ఐతే కరోనా-లాక్ డౌన్ మళ్లీ ప్రభాస్ అదుపు తప్పేలా చేసినట్లుంది. లాక్ డౌన్ మొదలయ్యాక ఎక్కడా కనిపించని ప్రభాస్.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొంటూ మీడియా దృష్టిలో పడ్డాడు. మంత్రి సంతోష్‌తో కలిసి ప్రభాస్ ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఫొటోలు బయటికి వచ్చాయి. అందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
అతను మళ్లీ షేప్ ఔట్ అయిన సంగతి స్పష్టంతా తెలిసిపోతోంది. బాగా లూజ్‌గా ఉన్న డ్రెస్ వేసి మేనేజ్ చేద్దామని చూసినా ఫలితం లేకపోయింది. అతను ఫిట్‌గా లేని సంగతి తెలిసిపోతోంది. లాక్ డౌన్ టైంలో వర్కవుట్లన్నీ ఆపేసి, డైట్ కూడా పక్కన పెట్టేసినట్లున్నాడు ప్రభాస్. అందుకే లుక్‌లో తేడా వచ్చినట్లుంది. అతడి కొత్త సినిమా షూటింగ్‌ను కొన్ని వారాల్లో మళ్లీ మొదలుపెడతారంటున్నారు. ఈలోపు ప్రభాస్ గట్టిగా వర్కవుట్ చేస్తే తప్ప సినిమాకు అవసరమైన లుక్‌లోకి రాలేడు.
This post was last modified on June 12, 2020 3:25 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…