Movie News

‘మాస్క్ తీసేదేలే..’ పుష్పను వాడేసిన ప్రభుత్వం!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రీసెంట్ గా ‘పుష్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నటుడిగా బన్నీ రేంజ్ ని పెంచిన సినిమా ఇది. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. అక్కడ కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. ఈ సినిమాలో పాటలు, సన్నివేశాలను రీల్స్ గా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అభిమానులు. 

పలు ఇండియన్ క్రికెటర్స్ కూడా బన్నీను అనుకరిస్తూ.. ‘తగ్గేదేలే’ డైలాగ్ ను రీల్స్ గా చేశారు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు బన్నీ ‘పుష్ప’ పోస్టర్ కి హెల్మెట్ పెట్టి ప్రమోషన్స్ కోసం వాడేశారు. తాజాగా భారత ప్రభుత్వం కూడా ‘పుష్ప’ క్రేజ్ ని వాడేసింది. భారత ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘పుష్ప’ పోస్టర్ ను పోస్ట్ చేశారు. 

బన్నీ ‘తగ్గేదేలే’ స్టిల్ ను పోస్ట్ చేస్తూ.. కరోనా నియంత్రణ ప్రచారంలో వాడేసాహెరు. ‘డెల్టా లేదా ఒమిక్రాన్.. ఏదైనా సరే నేను మాత్రం మాస్క్ తీసేదేలే’ అన్నట్లుగా టైటిల్ జోడించారు. రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కంట్రోల్ చేయాలంటే మాస్క్ తప్పనిసరి. 

కానీ చాలా మంది మాస్క్ లు ధరించడం లేదు. దీంతో  ప్రేక్షకుల్లో అవగాహన పెంచడానికి ‘పుష్ప’ పోస్టర్ ను వాడుకుంటూ కొత్త ప్రమోషన్ మొదలుపెట్టారు. దీన్ని బట్టి ఈ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో అర్ధమవుతోంది. ఏకంగా ఇండియన్ గవర్నమెంట్ బన్నీ పోస్టర్ ను వాడుకోవడం విశేషమనే చెప్పాలి. 

This post was last modified on January 19, 2022 9:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారీ కుంభకోణంలో చిక్కుకున్న భారత యువ క్రికెటర్లు!

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…

29 minutes ago

నాగచైతన్యకు అల్లు అరవింద్ హామీ

తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…

1 hour ago

‘గేమ్ చేంజర్’ టీంకు సెన్సార్ బోర్డు చురక

తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టాలన్న స్పృహ రాను రాను తగ్గిపోతూ వస్తోంది. ఈ ఒరవడి తెలుగులోనే కాదు.. వేరే…

2 hours ago

విడాముయర్చి గొడవ… రాజీ కోసం లైకా ప్రయత్నాలు

ఒకప్పుడు విదేశీ భాషలకు చెందిన సినిమాలను మన ఫిలిం మేకర్స్ యథేచ్ఛగా కాపీ కొట్టేసి సినిమాలు తీసేసేవారు. వాటి గురించి…

3 hours ago

పవన్ నన్ను దేవుడిలా ఆదుకున్నారు : నటుడు వెంకట్

టాలీవుడ్ పవన్ స్టార్, ఏపీ డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మానవతావాది అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు…

3 hours ago

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగింది?

భారత క్రికెట్ జట్టు మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు జట్టులో అనేక…

4 hours ago