టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చేతిలో మూడునాలుగు సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా ఈ సంక్రాంతికి రావాల్సింది కానీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం వాయిదా వేశారు. తీరా చూస్తే కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ కూడా వాయిదా పడింది. ఇప్పట్లో ‘భీమ్లానాయక్’ సినిమా కూడా విడుదలయ్యే పరిస్థితి లేదు. మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఏకకాలంలో ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలు చేయాలనుకుంటున్నారు.
క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఇప్పటికే ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు. అలానే హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ లో కూడా పవన్ పాల్గొంటారని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది.
అందుకే ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే హరీష్ శంకర్ ఈ సినిమా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సమాచారం. ముఖ్యంగా భగత్ సింగ్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ పాత్రలో పవన్ కి ధీటుగా సరైన విలన్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు.
దీనికోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయనైతే కథకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతారని హరీష్ శంకర్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. విజయ్ సేతుపతి హీరోగానే కాకుంగా విలన్ గా కూడా సినిమాలు చేస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాలో ఆయన విలన్ అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలానే ‘మాస్టర్’ సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించారు. ఇప్పుడు పవన్ సినిమాలో విలన్ గా అంటే ఆయన పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి!
This post was last modified on %s = human-readable time difference 8:22 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…