‘పుష్ప’ సినిమా సక్సెస్ అవుతుందనుకున్నారే కానీ ఈ రేంజ్ హిట్టునైతే ఎవరూ ఊహించలేదు. చివరికి ఆ మూవీ టీమ్ కూడా. బాలీవుడ్‌లో అక్కడి సినిమాలను సైతం పక్కకు నెట్టి విజయం సాధించింది పుష్ప. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి మొత్తం సుకుమార్ మీదికి మళ్లింది. పలు భాషల హీరోలు సుకుమార్‌తో వర్క్ చేయాలని ఆశపడుతున్నట్టు తెలుస్తోంది.
ఓ బాలీవుడ్ హీరో తనతో వర్క్ చేయాలనుకుంటున్నాడని సుకుమార్ రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ఇంతలె ఒక తమిళ హీరో కూడా సుకుమార్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనే వార్త గుప్పుమంది. ఆ హీరో ఎవరో కాదు.. ధనుష్. ఇదెంత వరకు నిజమో తెలియదు కానీ.. వెరైటీకి పెద్ద పీట వేసే ధనుష్‌కి సుకుమార్ ఓ సూపర్బ్ స్టోరీ చెప్పాడని, అతను ఓకే అన్నాడని, త్వరలో అనౌన్స్‌మెంట్ వస్తుందని చెప్పుకునేంత వరకు వెళ్లిపోయింది విషయం.
ఆల్రెడీ ధనుష్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ములతో ఓ సినిమాని ప్రకటించాడు. అది సెట్స్‌కి వెళ్లేలోపే వెంకీ అట్లూరితో ‘సర్’ సినిమాని పట్టాలెక్కించాడు. పుష్ప చూసిన తర్వాత ఇంప్రెస్ అయిపోయి మూడో మూవీని సుకుమార్‌తో సెట్ చేసుకున్నాడని సమాచారం. ఒకవేళ ఇది నిజమే అయినా ఇప్పుడప్పుడే స్టార్టయ్యే చాన్స్ లేకపోవచ్చు.
ఎందుకంటే చేతినిండా సినిమాలతో ధనుష్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిని పూర్తి చేయడానికే కరోనా అడ్డుపడుతోంది. ఇక కొత్త సినిమా అంటే ఇప్పట్లో కష్టమే. మరోవైపు సుకుమార్ ముందు ‘పుష్ప 2’ ఉంది. ఇంత సాలిడ్ హిట్ కొట్టాక సెకెండ్ పార్ట్‌ని మరింత ప్రెస్టీజియస్‌గా తీయాల్సిన ప్రెజర్ తనమీద ఉంటుంది. అలాంటప్పుడు వేరే సినిమాల గురించి ఆలోచిస్తాడా అనేది డౌట్. అందుకే ఈ వార్త నిజమా కాదా అనే డైలమా ఏర్పడింది. నిజమైతే సూపర్. నిజం కాకపోతే కేవలం రూమర్. అంతే.
This post was last modified on January 18, 2022 8:35 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…