ఆరేళ్ల కిందట సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా రిలీజై ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ లాంటి పెద్ద బడ్జెట్ సినిమాలతో పోటీ పడి ఈ చిత్రం బాక్సాఫీస్ విన్నర్‌గా నిలవడం విశేషం. ఈ ఏడాది సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు షెడ్యూల్ అయి ఉన్నా సరే.. తన సినిమా ‘బంగార్రాజు’ను సంక్రాంతికే రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు నాగ్.
‘సోగ్గాడే..’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో అయితే చాలా బాగా ఆడుతుందన్నది ఆయన నమ్మకం. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని నాగ్ బలంగా నమ్మాడు. ఇప్పుడు ఆయన నమ్మకమే నిజమైలంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రిలీజైతే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. పండక్కి విడుదలైన రౌడీ బాయ్స్, హీరో సినిమాలైతే ‘బంగార్రాజు’ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాయి.
ఈ మూడు చిత్రాల్లో దేనికీ పూర్తి స్థాయి పాజిటివ్ టాక్ రాలేదు.అన్నింట్లోకి మెరుగైన టాక్ వచ్చింది ‘బంగార్రాజు’కే. పైగా ఆ సినిమా సంక్రాంతి టైంలో కుటుంబంతో కలిసి చూడటానికి సరైన ఛాయిస్ కావడంతో ప్రేక్షకులు దానికే పట్టం కడుతున్నారు. రివ్యూలు, టాక్ అంత అనుకూలంగా లేకపోయినా సరే.. బాక్సాఫీస్ దగ్గర ‘బంగార్రాజు’ జోరు చూపిస్తోంది. మూడు రోజుల్లోనే దాదాపు రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా చిత్ర బృందం పోస్టర్లు రిలీజ్ చేస్తోంది.
ఈ ఫిగర్స్ కొంచెం అతిగా అనిపిస్తున్నప్పటికీ.. సినిమాకు మంచి వసూళ్లు వస్తున్న మాట మాత్రం వాస్తవం. వీకెండ్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయిందీ సినిమా. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు పర్వాలేదు. తర్వాతి వారానికి సరైన సినిమాలేవీ షెడ్యూల్ అయి లేవు. కాబట్టి రెండో వీకెండ్లోనూ ‘బంగార్రాజు’ హవా సాగించే అవకాశముంది. ఈ సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేశారు. మంచి రేట్లకు బయ్యర్లకు అమ్మారు. వాళ్లు కూడా మంచి లాభాలే అందుకునేలా కనిపిస్తున్నారు.
This post was last modified on January 17, 2022 7:07 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…