బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ ఇప్పుడు సినిమాలతో మరింత బిజీ అయింది. ‘క్షణం’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలు నటిగా ఆమె పాపులారిటీని పెంచాయి. రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది ఈ బ్యూటీ. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ లో తన రోల్ కి మరింత ప్రాముఖ్యత ఉంటుందని చెబుతుంది అనసూయ. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంటుంది.
తన డ్రెస్సింగ్, ఆమె చేసే కొన్ని కామెంట్స్ వలన నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తుంటారు. ట్రోలర్స్ అంతే ధీటుగా బదులిస్తుంటుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగితే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘ఆంటీ లేదా అక్క.. మిమ్మల్ని ఎలా పిలవాలి..?’ అని ప్రశ్నించగా.. ‘ఏదీ వద్దు. నన్ను అలా పిలవడానికి నేనెవరో నీకు అంత బాగా తెలియదు. నువ్ అడిగింది ఏజ్ షేమింగ్ కిందకి వస్తుంది. దీన్ని బట్టి నీ పెంపకం మీద అనుమానం వస్తుంది’ అని సమాధానమిచ్చింది.
అనసూయ ఇచ్చిన సమాధానం చాలా మందికి నచ్చలేదు. దీంతో ఓ నెటిజన్ ‘ఒకరిని అక్క అని పిలవడం ఏజ్ షేమింగ్ కాదు.. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవద్దు’ అని కామెంట్ చేయగా.. అది చూసిన అనసూయ.. ‘బహుశా ఏజ్ షేమింగ్ కాకపోవచ్చు కానీ మీరు నా ఉద్దేశాన్ని గమనించండి. నేనేం చెప్పానో మీకు తెలుసు. ఇక కాంప్లిమెంట్స్ తీసుకోవాలా..? వద్దా..? అనేది ఒకరి ఇష్టం కదా..!ఒక నావ సముద్రం మీద ఈదగలదు. అదే నావ, సముద్రాన్ని తన లోపలికి రానిస్తే… మునిగిపోతుంది. అందువల్ల… జన సముద్రం నుంచి ఏది ఎంత కావాలో/ తీసుకోవాలో నాకు తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది.
అలానే నెగెటివ్ ట్రోల్స్ పై స్పందిస్తూ.. ఒకప్పుతు తనపై, తన ఫ్యామిలీపై నెగెటివ్ ట్రోల్స్ ఎఫెక్ట్ చూపించేవని కానీ ఇప్పుడు తామంతా స్ట్రాంగ్ అయ్యామని చెప్పింది. ఎవరైనా ఎవరినైనా హర్ట్ చేస్తే.. చివరకు వాళ్లే బాధ పడతారని.. కర్మ అనేది ఒకటి ఉంటుందని అభిమానులతో చెప్పుకొచ్చింది అనసూయ.
This post was last modified on January 17, 2022 3:37 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…