సింగర్ చిన్మయి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. మీడియాలో ఉంటున్న ఫైర్ బ్రాండ్. తాజాగా చిన్మయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ‘సమాజం రేపిస్ట్‌లను ప్రేమిస్తుంది’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికొస్తే.. ‘2017లో కేరళలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి పలువురు సినీ సెలబ్రిటీలు గొంతెత్తారు. నటి భావన మీనన్ కిడ్నాప్, అత్యాచార వేధింపుల కేసులో నటుడు దిలీప్ కుమార్ జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్‌పై బయటికొచ్చాడు’.
అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో మలయాళ నటి పార్వతి తిరువోత్, ఐశ్వర్యా లక్ష్మీ ఉన్నారు. మహిళా సంఘాలతో కలిసి బాధిత హీరోయిన్‌కు ఆమె సపోర్ట్‌గా పోరాటం చేశారు. అయితే ఆ పోరాటం మధ్యలోనే ఆగిపోయింది. బాధిత హీరోయిన్‌కు సపోర్ట్‌గా నిలిచిన కారణం తను చాలా అవకాశాలు కోల్పోయానని నటి పార్వతి తెలిపారు. చేతిలో హిట్ సినిమాలు ఉన్నప్పటికీ అవకాశాలు రానివ్వకుండా చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పార్వతి అన్నారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటమే నేరమైందని పార్వతి వాపోయారు.
ఈ నేపథ్యంలో పార్వతి ఆవేదనపై సింగర్ చిన్నయి ట్వీట్ చేశారు. జరిగిన అన్యాయాన్ని నిలదీసి నిజం మాట్లాడినందుకు పార్వతిలాంటి ప్రతిభ ఉన్న నటి అవకాశాల కోల్పోయింది. అలాంటి నటి, లైంగిక వేధింపులు నుంచి తప్పించుకున్న వారి తరఫున మాట్లాడటం వల్లనే తన అవకాశాలు కోల్పోయింది అన్నది వాస్తవం. ఇదే సమస్యపై చాలామంది మౌనం వహించారు. సాటి మహిళ కోసం గొంతెత్తిన వారు మాత్రం సమస్యలను ఎదుర్కొంటున్నారు. ‘సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది’ అని చిన్మయి ట్వీట్ చేశారు. నటి భావన కూడా ఐదేళ్ల తర్వాత తనకు జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్మయి చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం రేపుతుండడం గమనార్హం.
This post was last modified on January 16, 2022 10:28 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…