Movie News

రవితేజ.. మళ్లీ ఒక రిస్క్

టాలీవుడ్ స్టార్ హీరోలు ఇంతకుముందులా మూస సినిమాలకు పరిమితం కావట్లేదు. అలాంటి సినిమాలతో రిస్క్ ఎక్కువైపోయింది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. స్టార్ హీరోలు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే బాగా ఆదరిస్తున్నారు. దీంతో ఎంత మాస్ హీరోలైనా సరే.. ఎంతో కొంత కొత్తదనం కోసం చూస్తున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు.

ఐతే మాస్ రాజా రవితేజకు మాత్రం ప్రయోగాలంటే చాలా భయం. అతను డిఫరెంటుగా ఏదైనా సినిమా చేశాడంటే చాలు.. గట్టి ఎదురు దెబ్బ తగులుతుంటుంది. నా ఆటోగ్రాఫ్, సారొస్తారు, డిస్కో రాజా.. ఇలా ఈ జాబితాలో చాలా సినిమాలే కనిపిస్తున్నాయి. ఒక నాలుగైదు మాస్ మసాలా సినిమాలు చేసి.. బ్రేక్ తీసుకుని ఒక డిఫరెంట్ మూవీ ట్రై చేస్తుంటాడు రవితేజ. కానీ అతడి ప్రయత్నానికి సరైన ఫలితమే దక్కట్లేదు.‘డిస్కో రాజా’తో షాక్ తిన్న తర్వాత ‘క్రాక్’ లాంటి మాస్ మసాలా సినిమా చేస్తే అది బ్లాక్‌బస్టర్ అయింది.

ఆ తర్వాత వరుసగా మాస్ సినిమాలే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఐతే ఇప్పుడు అతను మళ్లీ ఓ ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఆ చిత్రమే..రావణాసుర. ఇందులో రవితేజ నెవర్ బిఫోర్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు సమాచారం. అతడి పాత్ర.. లుక్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయట. ప్రేక్షకులు ఆ పాత్ర చూసి షాకవుతారని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఈ చిత్రానికి స్క్రిప్టు అందించింది సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ విస్సా కావడం విశేషం. ఇటీవల ‘పుష్ప’ మూవీతో మాటల రచయితగా అతడికి మంచి పేరొచ్చింది. సక్సెస్ మీట్లో ఈ యంగ్ రైటర్ గురించి సుక్కు చాలా గొప్పగా చెప్పాడు. గురువు బాటలో కొత్త కథలు రాస్తున్న శ్రీకాంత్.. రవితేజ కోసం ఓ ప్రయోగాత్మక స్క్రిప్టు రెడీ చేశాడు. దాన్ని సుధీర్ వర్మ చేతుల్లో పెట్టాడు. మరి రవితేజ చేస్తున్న ఈ రిస్క్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

This post was last modified on January 15, 2022 3:11 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

2 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

3 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

4 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

5 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

5 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

5 hours ago