మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసి వెంటనే శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ ను పూణేలో పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు.
ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తన బ్యానర్ లో వస్తోన్న 50వ సినిమా కావడంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను వెల్లడించారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
అంటే.. ఏడాది ముందుగానే సంక్రాంతి డేట్ ను లాక్ చేసుకున్నారన్నమాట. పాన్ ఇండియా సినిమా కాబట్టి పక్కా ప్లానింగ్ ప్రకారం అంతా చేస్తున్నారు. అందుకే రిలీజ్ డేట్ ని ముందే అనౌన్స్ చేసేశారు. పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో చరణ్ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలలో నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడింది. మరి వచ్చే ఏడాదికి ప్లాన్ చేసిన శంకర్ సినిమా అయినా చెప్పిన టైంకి వస్తుందో లేదో చూడాలి
This post was last modified on January 13, 2022 6:41 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…