అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ను పాన్ ఇండియా స్థాయిలో.. ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారంటే కామెడీగా చూసిన వాళ్లే ఎక్కువ. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు రిలీజ్ ఖర్చులైనా వస్తాయా.. అక్కడి జనాలు దీన్నసలు పట్టించుకుంటారా అంటూ చాలామంది ఎద్దేవా చేశారు. చివరికి ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ సైతం ఈ విషయంలో లోలోన నవ్వుకున్నారట. హిందీ రిలీజ్ పట్ల ఆయన అనాసక్తిగా ఉన్నారట. కానీ రిలీజ్ తర్వాత అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
ఈ సినిమా రోజు రోజుకూ వసూళ్లు పెంచుకుంది. అక్కడి ట్రేడ్ పండిట్లను షాక్‌కు గురి చేసే కలెక్షన్లు రాబట్టింది. రెండు, మూడు వారాల్లో కూడా ఓ కొత్త సినిమాలాగా అది రాబట్టిన రోజు వారీ వసూళ్లకు అందరూ ఆశ్చర్యపోయారు. ‘పుష్ప’ను తక్కువ అంచనా వేసిన వాళ్లందరికీ ఇది పెద్ద షాకే. ముఖ్యంగా ‘పుష్ప’ మూవీని లైట్ తీసుకుని క్రిస్మస్ సీజన్‌కు భారీ స్థాయిలో రిలీజ్ చేసిన ‘83’కి తగిలిన దెబ్బ అలాంటిలాంటిది కాదు.
భారతీయులకు క్రికెట్ అంటే ఉన్న పిచ్చి గురించి అందరికీ తెలిసిందే. క్రికెట్ మీద, స్టార్ క్రికెటర్ల మీద సినిమాలు తీస్తే బాగా ఆడతాయని ‘ఎం.ఎస్.ధోని’ సహా కొన్ని చిత్రాలు రుజువు చేశాయి. వాటిని చూసే 1983 వన్డే ప్రపంచకప్‌లో భారత్ సాధించిన అసాధారణ విజయం నేపథ్యంలో ‘83’ మూవీ తీశారు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే లాంటి టాప్ స్టార్లు జంటగా నటిస్తే.. కబీర్ ఖాన్ లాంటి అగ్ర దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
రిలీజ్ ముంగిట దీనికి మంచి క్రేజే కనిపించింది. మధ్యలో ఎన్ని ఓటీటీ ఆఫర్లు వచ్చినా తిరస్కరించి పట్టుబట్టి థియేటర్లలో రిలీజ్ చేశారు. సినిమాకు మంచి రివ్యూలొచ్చాయి. టాక్ కూడా బాగుంది. కానీ దానికి తగ్గట్లు వసూళ్లు మాత్రం లేవు. సినిమా రేంజ్, ప్రి రిలీజ్ హైప్, టాక్, రివ్యూల ప్రకారం చూస్తే ఈజీగా రూ.200 కోట్లు కొల్లగొట్టేయాలి.
కానీ ఈ చిత్రం ముక్కీ మూలిగి ఇప్పటికి రూ.100 కోట్ల మార్కును అందుకుంది. థియేట్రికల్ హక్కుల అమ్మకాలు, వసూళ్ల లెక్కల్లో చూస్తే ఈ చిత్రం ఫ్లాప్ అనే చెప్పాలి. ‘83’కి సిటీస్, మల్టీప్లెక్సుల్లో మంచి ఆదరణే దక్కినా రూరల్ మార్కెట్లలో తుస్సుమనిపించింది. అక్కడి జనాలంతా ‘పుష్ప’ అనే మాస్ మూవీకి పట్టం కట్టి.. ‘83’ని పట్టించుకోలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ‘83’ దెబ్బకు ‘పుష్ప’ ఏమవుతుందో అనుకుంటే.. ఆశ్చర్యకరంగా దాని దెబ్బే ‘83’కి గట్టిగా తగిలింది.
This post was last modified on January 13, 2022 12:11 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…