ఓ కొత్త హీరోని జనాలకు దగ్గర చేయడం అంత ఈజీ కాదు. అతను స్క్రీన్ మీద ఎలా ఉంటాడో తెలీదు. ఎలా యాక్ట్ చేస్తాడో ఐడియా ఉండదు. అయినా ఆడియెన్స్ థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలంటే ఒక్కటే మార్గం. మంచి ప్రమోషన్. అదిరిపోయే పబ్లిసిటీ. అందుకే తన తమ్ముడి కొడుకైన ఆశిష్‌ని ప్రమోట్ చేయడంలో ఏమాత్రం రాజీ పడటం లేదు దిల్ రాజు.
‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి డైరెక్షన్‌లో ఆశిష్ హీరోగా ‘రౌడీ బోయ్స్’ సినిమాని నిర్మించారాయన. ఈ సినిమా జనవరి 14న విడుదలవుతూ ఉండటంతో ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. ఓ వైపు ప్రెస్‌మీట్స్ జరుగుతున్నాయి. టీమ్ మెంబర్స్ ఒక్కొకరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్ అప్‌డేట్స్ వదులుతున్నారు.
ఇంకోవైపు స్టార్ హీరోలందరినీ ప్రమోషన్‌కి వాడేస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్‌ని ఎన్టీఆర్‌తో రిలీజ్ చేయించారు. ఒక పాటను మొన్న ఈవెంట్ పెట్టి మరీ అల్లు అర్జున్ చేత విడుదల చేయించారు. మరో పాటను ప్రభాస్ విడుదల చేశాడు. ఇప్పుడు మ్యూజికల్ ఈవెంట్ పెట్టి రామ్‌చరణ్‌ని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు.
దిల్ రాజుకి ఉన్న ఇమేజ్ కారణంగా ఇలా స్టార్ హీరోలంతా ఆశిష్‌ని ప్రమోట్ చేయడానికి ఒక్కో చెయ్యి వేస్తున్నారు. చాలాకాలం తర్వాత వస్తున్న ప్యూర్ కాలేజ్ స్టోరీ కనుక అందరినీ నచ్చుతుందనే నమ్మకంతో కూడా టీమ్ ఉన్నారు. మరి వీరి నమ్మకం, వారి హస్తవాసి కలిసి ఆశిష్‌కి, అతడి మొదటి సినిమాకి విజయాన్ని కట్టబెడతాయో లేదో చూడాలి.
This post was last modified on January 13, 2022 8:14 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…