ప్రస్తుతం మీడియాను కలిసిన ప్రతి ఫిలిం సెలబ్రెటీకి కామన్‌గా ఎదురవుతున్న ప్రశ్నలు.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరల తగ్గింపుపై మీ స్పందనేంటి? ఆ రేట్లతో మీ సినిమాకు సమస్య లేదా? మొన్న ‘బంగార్రాజు’ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో అక్కినేని నాగార్జునకు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నలకు ఆయనిచ్చిన సమాధానాలు అందరికీ షాకిచ్చాయి. అక్కడున్న ధరలతో తన సినిమాకైతే ఏ ఇబ్బందీ లేదనేశారాయన.
ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ నొక్కి వక్కాణించారు కూడా. అంతే కాక సినిమా వేడుకల్లో రాజకీయ అంశాలు మాట్లాడనంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చర్చనీయాంశమైంది. తాజాగా నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ థ్యాంక్ యు మీట్లో ఇదే విషయమై ప్రశ్నలు ఎదురైతే తన స్పందన తెలియజేశారు. సినిమా పరిశ్రమ తరఫున తమ సమస్య చెప్పుకుందామనుకున్నా వినే నాథుడెవరున్నారు అంటూ తన అసహనం ప్రకటించారు.
ఇప్పుడిక నాగచైతన్య వంతు వచ్చింది. ‘బంగార్రాజు’ ప్రమోషన్లో భాగంగా ఈ రోజు చైతూ మీడియాను కలిశాడు. ఈ సందర్భంగా టికెట్ల రేట్ల అంశాన్ని ప్రస్తావిస్తే.. తన తండ్రి మాటే తన మాట అన్నట్లుగా మాట్లాడాడు చైతూ. ‘‘నేను నటుణ్ని మాత్రమే. ఈ ఇష్యూస్ అన్నిటి గురించి నాకు అంతగా తెలియదు. నాన్న గారు ఆల్రెడీ సినిమా బడ్జెట్ పరంగా క్లియర్ గా ఒక మాట చెప్పేశారు.
ఈ సినిమా బడ్జెట్‌కి ఈ ధరలు ఓకే అన్నారు. ఒకవేళ రేట్లు పెరిగితే బోనస్ అన్నారు’’ అని చైతూ అన్నాడు. తన తండ్రి మాటలు వివాదాస్పదం అయి.. ఇండస్ట్రీ వైపు నుంచే చాలా విమర్శలు వచ్చిన నేపథ్యంలో మళ్లీ తాను ఒక కామెంట్ చేసి ఇంకో వివాదం రాజేయడం ఎందుకు అనుకున్నట్లున్నాడు చైతూ. మామూలుగానే అతను వివాదాలకు దూరం. ఈ అంశంలో మరింత జాగ్రత్తగా మాట్లాడినట్లున్నాడు చైతూ. ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 12, 2022 7:50 pm
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…