నాని కెరీర్లో ‘శ్యామ్ సింగ రాయ్’ని చాలా ముఖ్యమైన సినిమాగా చెప్పాలి. ఇది అతడి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం. పైగా వి, టక్ జగదీష్ చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడమే కాక.. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’తో ప్రేక్షకులను మెప్పించడం.. థియేటర్లలో రిలీజై ఇది విజయవంతం కావడం చాలా అవసరం అయింది. ఐతే అఖండ, పుష్ప’ చాలా బాగా ఆడుతున్న టైంలో రిలీజైన ‘శ్యామ్ సింగ రాయ్’ ఏమేర ప్రభావం చూపుతుందో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పైగా ఈ సినిమాకు మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. దీంతో ‘శ్యామ్ సింగ రాయ్’ బాక్సాఫీస్ సక్సెస్ మీద సందేహాలు వ్యక్తమయ్యాయి. ఐతే ఈ సందేహాలను ఆ చిత్రం పటాపంచలు చేసింది. నిలకడగా వసూళ్లు సాధించి, లాంగ్ రన్‌తో ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది. మూడు వారంలోనూ సత్తా చాటుతున్న ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.24 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.‘శ్యామ్ సింగ రాయ్’ థియేట్రికల్ హక్కుల వాల్యూ రూ.20 కోట్లు.
ఏపీలో చాలా చోట్ల సొంతంగా రిలీజ్ చేశాడు నిర్మాత. అక్కడ టికెట్ల రేట్లు తక్కువ ఉండటం, కొన్ని థియేటర్లు మూతపడటం వల్ల అనుకున్నంత షేర్ రాలేదు. అక్కడ స్వల్ప నష్టాలు తప్పలేదు. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే నిర్మాతకు ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. ‘శ్యామ్ సింగ రాయ్’ డిజిటల్ రైట్స్ ద్వారా కూడా మంచి ఆదాయమే తెచ్చిపెట్టినట్లు సమాచారం.
అలాగే రీమేక్, డబ్బింగ్ హక్కుల ద్వారా కూడా చెప్పుకోదగ్గ ఆదాయమే వస్తుందని అంచనా వేస్తున్నారు. మూడో వారంలోనూ సత్తా చాటుతున్న ‘శ్యామ్ సింగ రాయ్’కి సంక్రాంతి సీజన్ కూడా కలిసొస్తే ఇంకొంత షేర్ రాబట్టుకోవడానికి అవకాశముంది. మొత్తానికి నాని కెరీర్లో చాలా రిస్కీ మూవీలా అనిపించిన ‘శ్యామ్ సింగ రాయ్’ బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ అందుకుంది. ఇది నాని కొత్త చిత్రాలు ‘అంటే సుందరానికి’.. ‘దసరా’లకు బాగా కలిసొచ్చే విషయమే.
This post was last modified on January 12, 2022 4:55 pm
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…