తమిళంలో ఎప్పుడో ఏడేళ్ల కిందట విడుదలైన సినిమా మద్రాస్. కార్తి కథానాయకుడిగా పా.రంజిత్ రూపొందించిన సినిమా ఇది. కబాలి కంటే ముందు రంజిత్ ఈ సినిమా తీశాడు. అతడికి దర్శకుడిగా ఇది రెండో సినిమా. రంజిత్ కెరీర్లోనే దీన్ని బెస్ట్ ఫిలింగా చెప్పొచ్చు. కార్తి కెరీర్లో కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రమే.
ఐతే అంత పాత సినిమాను ఇప్పుడు తెలుగులో ఓ కొత్త చిత్రంలా కలరింగ్ ఇస్తూ రిలీజ్ చేయాలని చూశాడు ఓ నిర్మాత. సంక్రాంతికి పెద్ద సినిమాలు రేసు నుంచి తప్పుకోవడంతో ఉన్నట్లుండి ఈ పాత సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. పైగా ఈ చిత్రానికి నా పేరు శివ-2 అని టైటిల్ పెట్టి గతంలో వచ్చిన కార్తి హిట్ మూవీ నా పేరు శివకు సీక్వెల్ లాగా భ్రమింపజేయడానికి కూడా చూశారు. ఐతే సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా?
ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని వరల్డ్ సినిమా మొత్తం మీదా తిరుగులేని పట్టు సాధించిన నెటిజన్లకు తమిళ సినిమాల గురించి తెలియదా? సోషల్ మీడియా లేని రోజుల్లో అయితే ఇలాంటి గిమ్మిక్కులు పని చేసేవి కానీ.. అప్పుడు వర్కవుట్ కావసలు. నా పేరు శివ-2 పాత సినిమా అనే విషయం బయటపెట్టి తెలుగు ప్రేక్షకులంటే ఇంత చులకనా.. మమ్మల్ని ఫూల్స్‌ను చేద్దామనుకుంటున్నారా అని ఏకి పడేశారు ఈ చిత్ర బృందాన్ని.
నిజానికి ఈ సినిమాను కార్తి తెలుగులో ప్రమోట్ చేద్దామని కూడా అనుకున్నట్లుగా వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమో కానీ.. సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్టర్లతో కొంత హడావుడి చేశాక సోషల్ మీడియాలో ఎదురైన తీవ్ర విమర్శలు చూశాక జడిసి వెనక్కి తగ్గింది చిత్ర బృందం. ప్రస్తుతానికి సంక్రాంతి నుంచి ఈ సినిమా వాయిదా పడ్డట్లు ప్రకటన చేశారు. బహుశా ఆ తర్వాత కూడా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు లేనట్లే. రిలీజైనా మన ప్రేక్షకులను దీన్ని పట్టించుకోకపోవచ్చు.
This post was last modified on January 12, 2022 10:25 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…