హీరోగా నిలదొక్కుకోడానికి చేసిన ప్రయత్నాల కంటే.. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో చేసిన స్పెషల్ పాత్రే ఎక్కువ పేరు తెచ్చింది సుశాంత్‌కి. అందుకేనేమో.. అలాంటి పాత్రలపై దృష్టి పెడుతున్నాడు. ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి రెడీ అంటున్నాడు. రీసెంట్‌గా మరో మూవీలో కీలక పాత్రలో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే ‘రావణాసుర’. రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రవితేజకి డెబ్భయ్యో సినిమా.
‘హీరోలు ఉనికిలో లేరు.. కానీ రాక్షసులు ఉన్నారు’ అనేది క్యాప్షన్. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇది సరికొత్త కాన్సెప్ట్‌తో తీస్తున్న యాక్షన్ థ్రిల్లర్ అని ప్రకటించిన టీమ్.. రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఇంప్రెస్ చేసేసింది. ఇందులో రవితేజ లాయర్‌గా నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో నటించడానికి సుశాంత్‌ని తీసుకున్నారు. ఈ విషయాన్ని నిన్న అఫీషియల్‌గా ప్రకటించిన మేకర్స్.. సుశాంత్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు.
నీలి కళ్లు.. పొడవాటి జుట్టు.. గుబ్బురు గడ్డంతో కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు సుశాంత్. తను రామ్ అనే పాత్రలో కనిపించనున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. రావణాసుర అనే టైటిల్ హీరోకి పెట్టడం, సుశాంత్‌కి రామ్ అనే పేరు పెట్టడం ఆసక్తిని పెంచుతోంది.
సంక్రాంతి సందర్భంగా జనవరి 14న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా లాంఛనంగా మొదలు కానుంది. వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. శ్రీకాంత్ విస్సా అందించిన పవర్‌ఫుల్ స్టోరీ, సుధీర్ టేకింగ్‌తో పాటు మాస్ మహరాజా క్యారెక్టరైజేషన్ అదిరిపోతాయని ఊరిస్తున్నారు. మరి సుశాంత్ ఎలాంటి పాత్ర చేయబోతున్నాడో.. ఈ సినిమా తన కెరీర్‌కి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.
This post was last modified on January 11, 2022 7:55 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…