తెలుగు సినిమాకు సంబంధించిన ఒక మల్టీ టాలెంట్ ఉన్న ప్రముఖులు చాలా కొద్ది మందే ఉంటారు. అందులో ఒకరు తనికెళ్ల భరణి. నటుడిగా మాత్రమే కాదు.. రచయితగా.. కవిగా సుపరిచితుడు. తెలుగు సినిమాకు సంబంధించి.. ఏ పాత్రకైనా సరే పరకాయి ప్రవేశం చేసేయటం తనికెళ్ల భరణికి మాత్రమే చెల్లు అని చెప్పాలి. తన విలక్షణమైన తీరుతో ఎంతో మందిని తన అభిమానులుగా చేసుకున్న ఆయన.. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన నోటి నుంచి పలు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.
ఊహ గుర్తుంది కదా? ప్రస్తుతం సీనియర్ కథానాయకుడిగా సుపరిచితమైన శ్రీకాంత్ సతీమణిగా ఉన్న సినీ నటి ‘ఉహ’ గుర్తుందా? ఆమె నటించిన మూవీలో తనికెళ్ల విలనిజాన్ని ప్రదర్శిస్తారు. ఈ మూవీలో మరదలపై కన్నేసిన బావగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయనకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయట. కొందరైతే ఫోన్లు చేసి చంపేస్తామని మహిళామణులు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను కేవలం నటించానని.. దాన్ని సీరియస్ గా తీసుకోవద్దని చెప్పినట్లు వెల్లడించారు.
అది కేవలం స్క్రీన్ మీదనే తప్పించి మరింకేమీ కాదని తాను సర్ది చెప్పినా.. వారు ఊరుకునే వారు కాదన్నారు. తెలుగు వారికి నటన అన్నా.. సినిమాలు అన్నా ఎంత క్రేజ్ అన్నది తెలిసిన అంశమని చెప్పారు తనికెళ్ల భరణి. నటుడిగా, రచయితగా తెలుగువారందరికీ సుపరిచితమే. తన విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన నిజ జీవితంలోబెదిరింపులను సైతం ఎదుర్కొన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ విషయాలను వెల్లడించాడు.
ఊహ సినిమాలో కీలక పాత్ర పోషించిన తనికెళ్ల భరణి.. ఆ సినిమాలో కాస్త విలనిజం కనబరుస్తాడు. భర్త చనిపోయిన మరదలిపై కన్నేసిన ఊహ బావ పాత్రలో తనికెళ్ల నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నటనకు ఎంత గుర్తింపు వచ్చిందో అదే స్థాయిలో బెదిరింపులు కూడా వచ్చాయట. ఆ సినిమా అనంతరం కొందరు మహిళలు తనను చంపేస్తామంటూ బెదిరించారు. అది నిజం కాదు.. కేవలం నటన మాత్రమే అని చెప్పినా కొందరు వినిపించుకునేవాళ్లు కాదు. నటన అంటే ప్రేక్షకులు అంతలా మమేకమైపోతారు అంటూ చెప్పుకొచ్చారు. తనికెళ్ల చెప్పిన మాటల్లో నిజం ఉందని చెప్పక తప్పదు.
This post was last modified on January 9, 2022 10:27 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…