బిగ్ బాస్ షో బుల్లితెరపై ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. విదేశాలకు చెందిన ఈ షో ఇప్పుడు ఇండియాలో కూడా బాగా ఫేమస్ అయింది. ముందుగా నార్త్ లో మొదలుపెట్టిన ఈ షోని మెల్లగా సౌత్ కి కూడా తీసుకొచ్చారు. తెలుగులో ఇప్పటికీ ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. రీసెంట్ గానే సీజన్ 5 ఫినాలే జరిగింది. ఈ సీజన్ విజేతగా సన్నీ నిలిచారు. ఇదిలా ఉండగా.. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలుకాబోతుంది.
అయితే ఈసారి ప్రత్యేకంగా ఓటీటీ కోసం ఈ షోని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘వూట్’లో బిగ్ బాస్ షోని టెలికాస్ట్ చేశారు. కానీ ఓటీటీ వెర్షన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే తెలుగులో డిఫరెంట్ గా ప్లాన్ చేసి.. ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు. ఈ షో కేవలం పది వారాలు మాత్రమే ఉంటుందట. సాధారణంగా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో వంద రోజులకు పైగానే ఉంటుంది.
కానీ ఓటీటీ బిగ్ బాస్ మాత్రం కేవలం పది వారాలే ఉంటుందని సమాచారం. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ఈ షోకి నాగార్జున హోస్ట్ గా కనిపించనున్నారు. ఇప్పటికే దాదాపు 15 మంది కంటెస్టెంట్స్ ను షార్ట్ లిస్ట్ చేశారట. యూట్యూబ్, సోషల్ మీడియాకు చెందిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది.
షోని పది వారాలు ప్లాన్ చేశారు కాబట్టి దానికి తగ్గట్లుగా కంటెస్టెంట్స్ ఎంపిక ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ షో మొదలయ్యే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన సెట్స్ ను నిర్మిస్తున్నారట. మొత్తానికి ఈసారి సుత్తి లేకుండా.. పది వారాల్లో షోని ముగించేయాలని ప్లాన్ చేశారు. మరి ఈ ఐడియా ప్లస్ అవుతుందో లేదో చూడాలి!
This post was last modified on January 8, 2022 9:27 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…