ఇండియాస్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్‌లో కేజీఎఫ్ 2 మొదటి వరుసలోనే ఉంది. ఫస్ట్ పార్ట్ ఐదు భాషల్లో విజయ ఢంకా మోగించడంతో సెకెండ్ చాప్టర్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్‌ల లుక్స్‌తో పాటు టీజర్ కూడా దుమ్ము రేపింది. దాంతో మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
అయితే అన్ని సినిమాల్లాగే దీనికీ కరోనా అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. షూటింగ్ పూర్తై చాలా కాలమైనా మూవీ థియేటర్స్‌కి రాకుండా ఆగింది. ఎట్టకేలకి ఈ యేడు ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు ఫిక్సయ్యారు దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వీలు కాదేమో, వాయిదా తప్పదేమో అని సందేహ పడ్డారంతా. కానీ తాము అదే డేట్‌కి వస్తామంటూ టీమ్ కన్‌ఫర్మ్ చేసింది.
ఇవాళ యశ్ పుట్టినరోజు కావడంతో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. ఇది అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. అగ్రెసివ్‌గా నిలబడిన యశ్ దగ్గర డేంజర్ బోర్డ్ పెట్టి ఉంది. దానిపై ప్రమాదం రాబోతోందనే హెచ్చరిక రాసి ఉంది. దాన్నిబట్టి సెకెండ్ చాప్టర్‌లో యశ్ పాత్ర ఎంత డేంజరస్‌గా ఉండబోతోందో అర్థమయ్యింది.
ఈ సందర్భంగానే రిలీజ్ డేట్‌ని కూడా మరోసారి కన్‌ఫర్మ్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 14న రాఖీభాయ్ రచ్చ మొదలు కావడం గ్యారంటీ అంటున్నారు. ఇంకా మూడు నెలలు ఉంది కాబట్టి, అప్పటికి పరిస్థితులు చక్కబడే చాన్స్ ఉంది కాబట్టి ఇప్పటికి ఆ డేట్‌కి ఫిక్సవ్వడమే. అప్పుడేం జరుగుతుందో అప్పటి సిట్యుయేషన్ డిసైడ్ చేస్తుంది కనుక అంతవరకు వెయిట్ చేయడమే.
This post was last modified on January 8, 2022 12:46 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…