తెలుగులో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయకుల్లో కార్తి ఒకడు. అన్న సూర్య లాగే ఇక్కడ అతను కూడా తనదైన ముద్ర వేయగలిగాడు. యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖాకి లాంటి సినిమాలతో అతను తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కానీ గత కొన్నేళ్లలో అతడి సినిమాలు ఇక్కడ పెద్దగా ఆడలేదు.
కార్తి అనే కాదు.. సూర్య సహా చాలామంది తమిళ హీరోలు ఇక్కడ గతంలో ఉన్న మార్కెట్‌ను దెబ్బ తీసుకున్నారు. ఓవరాల్‌గా తమిళ సినిమాల క్వాలిటీ పడిపోవడం, మన సినిమాల రేంజ్ పెరగడమే అందుక్కారణం. ఐతే ఇప్పుడు ఏదైనా మంచి సినిమా చేసి మన వాళ్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాల్సింది పోయి.. తాను ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట చేసిన సినిమాను ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తున్నాడు కార్తి.
దానికి మళ్లీ నా పేరు శివ-2 అని టైటిల్ కూడా పెట్టారు.
ఈ టైటిల్ చూసి ఇది నా పేరు శివకు సీక్వెల్ ఏమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. కబాలి, కాలా చిత్రాల దర్శకుడు పా.రంజిత్ మద్రాస్ పేరుతో తీసిన సినిమా ఇది. కబాలి కంటే ముందు అతను చేసిన చిత్రమిది. తమిళంలో బాగానే ఆడింది. పోస్టర్లో కార్తి లుక్ చూస్తేనే ఇది పాత సినిమా అనే విషయం అర్థమైపోతుంది. ఓటీటీలు లేని రోజుల్లో అయితే కాస్త పాత సినిమాలు తీసుకొచ్చి అనువాదం చేసి రిలీజ్ చేసినా చెల్లేది.
కానీ ఇప్పుడు ప్రతి సినిమా ఓటీటీల్లో అందుబాటులో ఉండగా.. ఎప్పుడో ఎనిమిదేళ్ల నాటి సినిమాను నా పేరు శివ సీక్వెల్ లాగా భ్రమింపజేస్తూ రిలీజ్ చేయడం విడ్డూరం. ఇది తెలుగు ప్రేక్షకులను చులకనగా చూడటం తప్ప మరేం కాదు. ఒక రోజు ముందే వలిమై అనే తమిళ సినిమా తెలుగు వెర్షన్‌కు తమిళ టైటిలే పెట్టి పోస్టర్ రిలీజ్ చేయడం చూసి మన వాళ్లకు మండిపోయింది. ఇప్పుడిలా పాత సినిమాను కొత్త చిత్రంలా కలరింగ్ ఇస్తూ రిలీజ్ గురించి ప్రకటన చేయడం చూసి ఇంకా చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది.
This post was last modified on January 6, 2022 6:57 am
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…