కోలీవుడ్ హీరో శింబు నటించిన లేటెస్ట్ సినిమా ‘మానాడు’. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ గా నటించాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళనాట ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని.. దానికి సంబంధించిన హక్కులు గీతాఆర్ట్స్ చేతిలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో అల్లు సిరీస్ హీరోగా నటించే ఛాన్స్ ఉందన్నారు.
అయితే నిజానికి ఈ సినిమా రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ తెలుగులో రీమేక్ చేయబోతుంది. ‘మానాడు’ సినిమాను కాపీ కొట్టి తెలుగులో ఓ సినిమా రూపొందిస్తున్నారని విషయం సురేష్ ప్రొడక్షన్స్ వరకు వెళ్లింది. అందుకే ‘మానాడు’ రీమేక్ రైట్స్ గురించి లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సినిమా రీమేక్ హక్కులు తమ దగ్గర ఉన్నాయని.. కథలో ఏ భాగమైనా కాపీ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తోంది. గీతాఆర్ట్స్ దగ్గర కూడా టైమ్ లూప్ కాన్సెప్ట్ ఒకటి ఉందట. దానికి ‘మానాడు’ కథకి ఏమైనా సంబంధం ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. నిజానికి ‘మానాడు’ సినిమాను తెలుగులో డబ్ చేశారు.
కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేయలేకపోయారు. కానీ ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ మాత్రం సోనీ లివ్ లో ఉంది. ‘మానాడు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లివ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పటికే చాలా మంది తెలుగు డబ్బింగ్ తో సినిమాను చూసేసారు. ఇలాంటి సమయంలో మళ్లీ రీమేక్ చేయడం సాహసమనే చెప్పాలి. మరేం చేస్తారో చూడాలి!
This post was last modified on January 5, 2022 3:25 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…