Movie News

అఖండ, పుష్ప.. OTT ఆట ఎప్పుడంటే?

2021 సంవత్సరానికి అదిరిపోయే ముగింపును ఇచ్చాయి అఖండ, పుష్ప సినిమాలు. వీటికి టాక్ మరీ గొప్పగా ఏమీ రాలేదు. కానీ బాక్సాఫీస్ దగ్గర అన్నీ భలేగా కలిసొచ్చాయి. దీంతో వసూళ్ల మోత మోగిపోయింది. వాటి లాంగ్ థియేట్రికల్ రన్ చూసి అందరూ విస్తుబోతున్నారు. ఎంత మంచి టాక్ వచ్చినా రెండో వారం తర్వాత కొత్త సినిమాలు డల్ అయిపోతున్న రోజుల్లో ఇవి మూడో వారంలోనూ అదరగొట్టాయి. ‘అఖండ’కు ఇప్పటికీ వీకెండ్స్‌లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.

‘పుష్ప’ అయితే ఒక కొత్త సినిమాలాగా వసూళ్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. ఐతే థియేటర్లకు వెళ్లి చూసేవాళ్లు బాగానే చూస్తున్నప్పటికీ.. వెళ్లలేని వాళ్లు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. మామూలుగా పెద్ద సినిమాలను కూడా నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి తెస్తున్న నేపథ్యంలో ‘అఖండ’ ఇంకా డిజిటల్ రిలీజ్ కాలేదంటి అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్ గురించి జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.

ఐతే ‘పుష్ప’ అమేజాన్ ప్రైమ్‌లోకి మరి కొన్ని రోజుల్లోనే రాబోతోందనే ప్రచారాన్ని నిర్మాతలు ఖండించారు.
ఐతే వాళ్లు ఖండించినప్పటికీ.. ఈ నెల ఏడో తారీఖునే ఈ సినిమా ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోందని సమాచారం. ఈమేరకు చాలా ముందుగానే ఒప్పందం జరిగిందట. 7న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజవుతుంది కాబట్టి అప్పటికి ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆటోమేటిగ్గా ముగిసిపోతుంది కాబట్టి ఆ రోజు ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల ఇబ్బందేమీ ఉండదనుకున్నారు.

కానీ అనూహ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది. ‘పుష్ప’ మూడు వారంలోనూ నార్త్ ఇండియాలో ఇరగాడేస్తోంది. దీంతో థియేటర్లలో ఇంత బాగా ఆడుతున్న సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసి కలెక్షన్లను పోగొట్టుకోవడం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. ఐతే డీల్ రివైజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని 7నే ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోందని గట్టిగానే వార్తలొస్తున్నాయి. ఇక ‘అఖండ’ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న హాట్ స్టార్‌లో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.

This post was last modified on January 4, 2022 5:51 pm

Share

Recent Posts

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

58 seconds ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

33 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago