Movie News

‘పుష్ప’ వృధా ఖర్చు.. అన్ని కోట్లా?

2021లో విడుదలైన ‘పుష్ప’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ పరంగా మాత్రం సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో, ఓవర్సీస్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ‘పుష్ప ది రైజ్’ కోసం రూ.180 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో చాలా సన్నివేశాలను ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేశారు.

అలా డిలీట్ చేసిన సన్నివేశాలకు ఖర్చు పెట్టిన మొత్తమెంతో తెలుసా..? రూ.12 కోట్లు. ఓ భారీ యాక్షన్ సీన్ ను కూడా డిలీట్ చేసేసారట. పోనీ ఈ సన్నివేశాలను సెకండ్ పార్ట్ కోసం వాడతారా అంటే.. అది కూడా చేసే ఛాన్స్ లేదట. దీంతో వేస్టేజ్ పార్ట్ చాలా ఎక్కువైందని సమాచారం. అలా డిలీట్ చేసిన సన్నివేశాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో విడుదల చేస్తుంది నిర్మాణ సంస్థ.

కొన్ని సన్నివేశాలనైతే ఎడిట్ కూడా చేయకుండా అలానే వదిలేశారట. ఒక భారీ బడ్జెట్ సినిమా తీయడమంటే మాములు విషయం కాదు. రోజుకి ప్రొడక్షన్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది. ‘పుష్ప’ సినిమా విషయంలో ఎన్ని రోజులు వేస్ట్ అయిందో కానీ మొత్తంగా రూ.12 కోట్ల విలువ చేసే సన్నివేశాలను డస్ట్ బిన్ లో వేసేశారు. ముందే ల్యాగ్ ఎక్కువ లేకుండా చూసుకొని ఉంటే ఈ వేస్టేజ్ కాస్ట్ తగ్గి ఉండేది.

మరి ఇప్పుడు ‘పుష్ప’ పార్ట్ 2 కోసం ఎంత బడ్జెట్ ను వెచ్చిస్తారో చూడాలి. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. సెకండ్ పార్ట్ మొత్తం అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ చుట్టూ తిరగనుంది. అలానే అనసూయ, సునీల్ ల పాత్రలకు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వబోతున్నారు. రష్మిక రోల్ కి సెకండ్ పార్ట్ లో పెద్దగా సీన్లు లేనప్పటికీ.. మళ్లీ రీరైట్ చేసి ఆమె స్క్రీన్ స్పేస్ ను పెంచుతున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on January 4, 2022 3:51 pm

Share

Recent Posts

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

10 minutes ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

2 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

3 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

3 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

4 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

6 hours ago