‘పుష్ప’ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుంటే.. బయటి వాళ్లే కాదు.. స్వయంగా ఆ చిత్ర దర్శకుడు సుకుమారే లోలోన నవ్వుకున్నాడట. ఆయన ఈ చిత్రాన్ని తెలుగు సినిమాగానే చూశాడట. మహా అయితే మలయాళంలో అల్లు అర్జున్‌కున్న ఫాలోయింగ్ వల్ల ఆడొచ్చేమో కానీ.. వేరే భాషల్లో ఈ సినిమా ప్రభావం చూపుతుందన్న ఆశలేమీ లేవట ఆయనకి. సుకుమార్ అనే కాదు.. చాలామంది అంచనా ఇదే.
పేరుకే ఇది పాన్ ఇండియా రిలీజ్ అవుతోందని.. ఉత్తరాదిన, తమిళనాడులో ఈ సినిమాను పెద్దగా పట్టించుకోకపోవచ్చని అనుకున్నారు. అందులోనూ రిలీజ్ ముంగిట బాగా హడావుడి అవడం, పోస్ట్ ప్రొడక్షన్ సరిగా చేయకపోవడం.. ప్రమోషన్లు లేకపోవడంతో ‘పుష్ప’ వేరే భాషల్లో ‘పుష్ప’ ప్రభావం మీద మరింత సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో సాధిస్తున్న వసూళ్లు చూసి ఇప్పుడు అందరూ విస్తుబోతున్నారు. హిందీ వెర్షన్ ఇప్పటికే రూ.60 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.
ఫుల్ రన్లో రూ.100 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదు. తమిళంలో రూ.25 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసింది. కేరళ వసూళ్లు రూ.15 కోట్లకు చేరువగా ఉన్నాయి. ఈ సినిమాకు ఈ ఫిగర్స్ ఎవ్వరూ ఊహించనివి. ఈ సినిమా ఆయా భాషల్లో బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకుంది. దీంతో ఆటోమేటిగ్గా ‘పుష్ప-2’పై అంచనాలు, అలాగే బిజినెస్ పెరిగిపోతాయనడంలో సందేహం లేదు. ‘పుష్ప-1’ విషయంలో సుకుమార్‌కు టైం లేక కొన్ని తప్పులు కూడా చేశాడు.
హడావుడి పడ్డాడు. ‘పుష్ప-2’ విషయంలో ఆయన కచ్చితంగా జాగ్రత్త పడి పకడ్బందీగా సినిమా తీస్తాడనడంలో సందేహం లేదు. అసలు కథంగా సెకండ్ పార్ట్‌లో ఉందని చెప్పడం కూడా ఎగ్జైట్ చేసేదే. కాబట్టి ‘పుష్ప-2’ ఇంకా మెరుగ్గా ఉండి, దీనిపై ఉన్న ఆసక్తిని ఇంకా పెంచేలా ప్రమోషన్లు చేస్తే హైప్ మామూలుగా ఉండదు. ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయం. నాన్-బాహుబలి, రాజమౌళి, ప్రభాస్ సినిమాల రికార్డులన్నింటినీ ఇది బద్దలు కొట్టేస్తుందేమో.
This post was last modified on January 4, 2022 2:13 pm
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…