దాదాపు అయిదేళ్లు కావస్తోంది ఒక మలయాళ స్టార్ హీరోయిన్ మీద లైంగిక దాడి జరిగి. అక్కడి టాప్ స్టార్లలో ఒకడైన దిలీపే ప్లాన్ చేసి ఈ దాడి చేయించాడని మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ఈ కేసులో అతను అరెస్టయి కొన్ని నెలలు జైల్లో గడిపాడు కూడా. దిలీప్ ఆదేశాల మేరకే పల్సర్ సుని అనే ఒక కిరాయి గూండా సదరు కథానాయికను కిడ్నాప్ చేసి కార్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఆమెమానసికంగా కుంగిపోయేలా చేసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ కేసు అప్పట్లో పెను సంచలనం. ఆ కథనాయికకు ఇండస్ట్రీ నుంచే కాక అన్ని వైపుల నుంచీ పెద్ద ఎత్తున మద్దతు లభించింది. దిలీప్‌ను అందరూ విలన్ లాగే చూశారు. అతడి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని, ఈ కేసులో అతను తప్పించుకోవడం సాధ్యం కాదని, కచ్చితంగా శిక్ష పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అలాంటిదేమీ జరగలేదు.
బెయిల్ మీద బయటికి వచ్చిన దిలీప్ ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నాడు.
ఈ కేసు చూస్తే ఎటూ తేలకుండా ఉంది. కాగా ఇప్పుడీ కేసు వ్యవహారం మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాధిత కథానాయిక తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరు మారిపోతుండటం గమనార్హం. ఈ కేసులో జడ్జి పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరు ఈ కేసు నుంచి తప్పుకున్నారట. ఈ మేరకు సదరు కథానాయిక ముఖ్యమంత్రి పినరపి విజయన్‌కు లేఖ రాసింది.
ఈ కేసును నీరుగార్చడానికి నిందితులు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారని, ధన బలం చూపిస్తున్నారని, కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగట్లేదని, వెంటనే జోక్యం చేసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె ఈ లేఖలో కోరింది. దీనిపై సింగర్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ చిన్మయి స్పందిస్తూ.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో ఎప్పడూ ఇలాగే అన్యాయమే జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
This post was last modified on January 3, 2022 10:11 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…