Movie News

‘పుష్ప’కు ఇంతగా కలిసొస్తున్నా..

‘పుష్ప’ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఈపాటికి ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయిపోయి ఉండాలి. కానీ తర్వాతి వారాల్లో దానికి పోటీనిచ్చే పెద్ద సినిమాలు రాకపోవడం, హిందీలో జెర్సీ మూవీ, అలాగే పాన్ ఇండియా మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటం దీనికి భలేగా కలిసొస్తోంది. విడుదలకు ముందు ఉన్న హైప్ వల్ల తొలి వారం భారీ వసూళ్లు వస్తే.. రెండో వారంలో క్రిస్మస్ సీజన్ కలిసొచ్చింది.

దీంతో ఆ సినిమా వసూళ్లు అంచనాలను మించిపోయాయి. హిందీలో అనూహ్యంగా ఇప్పటికే రూ.60 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకుందీ చిత్రం. తమిళం, మలయాళంలోనూ ఈ సినిమా మంచి లాభాలను అందిస్తోంది. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే తెలంగాణలో ఆల్రెడీ ‘పుష్ప’ బ్రేక్ ఈవెన్ మార్కును టచ్ చేసింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు మంచి లాభాలే వచ్చేలా ఉన్నాయి.

ఐతే ‘పుష్ఫ’కు ఇంతగా కలిసొచ్చినా.. దాని థియేట్రికల్ రన్ ఎక్స్‌టెండ్ అయినా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడానికి కష్టపడుతోంది. మూడో వారాంతంలోనూ సినిమాకు హౌస్ ఫుల్స్ పడినా.. ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు దూరంగానే ఉంది ‘పుష్ప’. సీడెడ్లో ఈ సినిమా థియేట్రకల్ హక్కులను రూ.18 కోట్లకు అమ్మితే.. ఈ ఆదివారం నాటికి అక్కడ షేర్ రూ.15.70 కోట్లు వచ్చింది.

అంటే ఇంకా 2.2 కోట్లు వస్తే కానీ ఈ చిత్రం బయ్యర్లను సేఫ్ జోన్లోకి తీసుకురాదన్నమాట. సంక్రాంతి వరకు ‘పుష్ప’ రన్ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి సీడెడ్లో కష్టపడి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులున్నాయి. కానీ ఆంధ్రాలో మాత్రం అది కష్టంగానే ఉంది. అక్కడ ‘పుష్ప’ హక్కులు రూ.48 కోట్లు పలికాయి. ఇప్పటిదాకా అక్కడ వచ్చిన షేర్ రూ.35 కోట్ల లోపే. ఎంత కష్టపడ్డా కూడా షేర్ రూ.40 కోట్లు వస్తే ఎక్కువ. చివరికి ఆంధ్రాలో మాత్రం ‘పుష్ప’ ఫ్లాప్‌గానే నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పాపం కచ్చితంగా టికెట్ల రేట్లదే అనడంలో సందేహం లేదు.

This post was last modified on January 3, 2022 4:15 pm

Share

Recent Posts

హైదరాబాద్ ఐమాక్స్ వారణాసికి ముందే

దేశంలోనే అత్యధిక‌ సినీ అభిమానం ఉన్న‌ది తెలుగు రాష్ట్రాల్లోనే అంటే అతిశ‌యోక్తేమీ కాదు. కానీ ఇంత‌టి అభిమానం ఉన్న చోట…

34 minutes ago

బెంగాల్ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు

ప‌శ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ‌కాలం పాటు పాల‌న సాగించిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం…

3 hours ago

వ‌రంగల్‌కు ఎయిర్‌పోర్టు… ఆ పేర్లు పెట్ట‌మ‌న్న‌ సందీప్ వంగ

ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాల‌నే నియ‌మాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, ప‌ట్ట‌ణాల‌కు కూడా విమానాశ్ర‌యాలు విస్త‌రిస్తున్నాయి. ఐతే మ‌రో తెలుగు…

3 hours ago

‘రాకా’ అనిరుధ్ లేదా జి.వి.ప్రకాష్ అనుకుని…

‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…

3 hours ago

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

4 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

4 hours ago